అరటి సాగు-యాజమాన్య
పద్ధతులు
ప్రపంచంలో అరటి ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానం.
మన దేశంలో 4.8 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో 16.
16 మిలియన్ టన్నుల అరటి ఉత్పత్తి అవుతుంది. అంతేకాక జాతీయ
స్థాయిలో అరటి పంటదే మొదటి స్థానం. దేశంలో మొత్తం పండ్ల తోటల విస్తీర్ణంలో 15% అరటిదే.
తమిళనాడు మహారాష్ట్ర విస్తీర్ణంలో ఉత్పాదకతలోను అరటి ముందు స్థానంలో ఉంది.
ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణంలో 5 వ స్థానంలో (150 వేల
ఎకరాలు). ఉత్పాదకతలో (21 లక్ష టన్నులు) 6వ
స్థానంలో ఉంది. చితూరు, కడప, కర్నూలు, అనంతపూర్, తూర్పుగోదావరి, వైజాక్,కృష్ణా, శ్రీకాకుళం, వరంగల్, రంగారెడ్డి, మెదక్
జిల్లాలో అరటిని ఎక్కువగా పండిస్తారు.
వాతావరణం:
v అరటి
ఉష్ణమండలపు పంట సరాసరి 25–30' సెం.గ్రే.
ఉష్ణోగ్రత మిక్కిలి అనుకూలం 10"సెం.గ్రే
లోపు 40సెం.గ్రే కంటే ఎక్కువ ఉండకూడదు. తక్కువ
ఉష్ణోగ్రతలో గెలలో పెరుగుదల ఉండదు. అధిక ఉష్ణోగ్రతలో ఆకులపై మచ్చలు ఏర్పడతాయి.
దీనివల్ల ఎదుగుదల ఆగిపోతుంది. ఏటా 500–2000 మి.మీ.
వర్షపాతం అవసరం సముద్రమట్టానికి 2000మీ. ఎత్తులో అరటి
బాగా పండుతుంది.
నేలలు:
v సారవంతమైన
తగినంత నీటి వసతి కలిగి నీరు ఇంకిపోయే గుణంతో పాటు తగినంత సేంద్రియ పదార్థం గల
నేలలు మిక్కిలి అనుకూలం. సారవంతమైన ఒండ్రు నేలలు శ్రేష్టము. అయితే బంక మన్ను
ఎక్కువగాను సున్నపు పొరలు ఉన్న రాతి నేలలు సాగుకి పనికిరావు. నేల 1-1.5 మీటర్ల
లోతు ఉండి pHవిలువ 6.5-7.5 ఉండటం
మంచిది.
రకాలు:
అరటిలో
ప్రాధాన్యత సంతరించుకొన్న రకాలు 70 దాకా ఉన్నాయి.
వీటిలో 10-12 రకాలు మన రాష్ట్రంలో విస్తృతంగా సాగు
చేస్తున్నారు. అవి.
1.
కర్పూర చక్కెర కేళి
v దేశంలో 70% అరటి
ఉత్పత్తి ఈ రకానిదే దీని గెలలు పెద్దవిగా 10-15 కేజీ
బరువుండును. గెలకు 130-175 కాయలుండి 10-12
హస్తాలతో ఉండును. 12 నెలల్లో పంట
వచ్చును. ఈ రకం నిల్వఉంచటానికి తగినవే కాక రవాణాకు కూడా మిక్కిలి శ్రేష్టం. పనామ
తెగుళ్ళును ఆకుమచ్చ తెగుళ్ళును బాగా తట్టుకొంటుంది. తేలిక నేలలో వర్షాభావ
పరిస్థితుల్లో సాంగు చేయవచ్చు.
2.
తెల్ల చక్కెర కేళి:
v ఈ రకం
ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాలో సాగులో ఉంది. ఆకులో
అంచులు పైకి తిరిగి ఉండటం ఈ రకం ప్రత్యేకత గెల చిన్నగా ఉండి 6-8 కేజీల
తూగుతుంది. ఒక గెలలో 5-6 హస్తాలతో 60-80
కాయలు కల్గిండును. 12 నెలల్లో
పంట కోతకు వచ్చును. పనామ తెగులును తట్టుకుంటుంది. అధిక ఉష్ణోగ్రత సారవంతం కానటువంటి
నేలలు కల్గిన తెలంగాణా రాయలసీమ ప్రాంతాలకు అనువైనది కాదు.
3.
అమృత పాణి లేదా రస్తాళి
v ఇది
పొడవు రకం. 13-14 నెలల్లో పంటకు వచ్చును. గెల 15-20 కేజీ బరువుండి 8-10 హస్తాలతో
80-100 కాయలు కలిగి ఉండును. ఎక్కువ కాలం నిల్వ చేయుటకు పనికి రాదు. పండిన వెంటనే
గెలల నుండి పండ్లు రాలిపోవును. పనామా తెగులు ఈ రకం పై తీవ్రంగా వస్తుంది. ఆకుమచ్చ
తెగులును తట్టుకోగలదు.
4.
రోబస్టా: (పెద్ద పచ్చ అరటి)
v ఇది
మధ్యరకం గెల 15-20 కేజీల బరువు 9-10 హస్తాలతో దాదాపు 125–130 కాయలు కల్గిండును.
11-12 నెలల్లో పంటకు వచ్చును. కాయలు కొంచెం పెద్దగా వుండి వంకర తిరిగి ఉంటాయి.
పండిన తర్వాత కూడా తొక్క ఆకుపచ్చగా ఉంటుంది. కాయలో గింజలు స్పష్టంగా వుంటాయి.
రాయలసీమ ప్రాంతాల్లో హెచ్చుగా పండిస్తారు. పనామ తెగులును తట్టుకుంటుంది. కాని
వెర్రితలల ఆకుమచ్చ తెగులు ఆశిస్తాయి.
5.
వామన కేళి (బసరాయ్) లేదా పొట్టి పచ్చ అరటి (డ్వార్స్ కావెండిన్):
v ప్రఖ్యాతిగాంచిన
పండు రకము, గట్టిగా ఉన్నందున తుఫాను గాలి తాకిడికి తట్టుకొనును. వీటి గెల 12-15
కేజీల బరువు 8-10 హస్తాలతో దాదాపు 120 కాయలు కల్గిండును. 11 నెలల్లో పంటకు
వచ్చును. ఇది చాలా తీపి రకము అన్ని ప్రాంతాలకు అనువైనది. పండు పండిన పిదప తోలుపైన
చుక్కలు వస్తాయి. పండిన పిదప శీతాకాలంలో పసుపుపచ్చ , వేసవి
కాలంలో ఆకు పచ్చగా ఉంటాయి. ఎక్కువ కాలం నిల్వకు పనికి రావు. పనామ తెగులును
తట్టుకుంటుంది.
6.
బొంత:
v ఇవి
విస్తృతంగా సాగులోన్న రకం. 13 నెలల్లో పంటకు వచ్చును. గెల 12-15 కేజీల బరువుతో 5-6
హస్తాలను కల్గి దాదాపు 70-80 కాయలు కలిగి ఉండును. కాయలు పెద్దవిగా కొంచెం వంకరగా
ఉండి అంచులు బాగా కన్పించును. అన్ని ప్రాంతాలకు అనువైన రకం ఆకుమచ్చ తెగులును
తట్టుకొనును. పనామ తెగులును తట్టుకోలేదు.
7.
ఏనుగు బొంత:
v బొంత
రకాన్ని మ్యూటేషన్ (ఉత్పరివర్తనం) ద్వారా రూపొందించిన మేలైన రకం 13-14 నెలల్లో
కాపుకు వస్తుంది. గెల 15-20 కేజీల బరువు 6-7 హస్తాలతో 75-100 కాయలు కలిగి ఉండును.
రాష్ట్ర మంతటా పండించుటకు అనువైన రకం ఆకుమచ్చ మరియు పనామ తెగులును తట్టుకోలేదు.
8.
గైండ్ నైన్:
v ఇది
ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకొనే శక్తి అధికంగా కల్గింటుంది. గెలల పరిమాణం
సైతం ఎక్కువగా ఉంటుంది. 12 నెలల పంట కాలం ఉన్న రకం 2.2-2.7 మీ. ఎత్తు సగటు గెల
బరువు 25-30 కేజీలు ఉండును.
9.
వ్రవర్ధనం:
v అరటిని
పిలకలు మరియు టిష్యకల్చర్ పద్ధతుల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. కొత్తగా అరటి తోట
వేయుటకు 3 నెలల వయసు గల అరటి పిలకలను తెగుళు లేని తల్లి చెట్టు నుండి ఎన్నుకోవాలి.
సూది మొన ఆకులు గల పిలకలను (Sword suckers) నాటుటకు
ఎన్నుకోవాలి. ఇవి అతి త్వరగా పెరిగి తక్కువ వ్యవధిలో పంటనిచ్చును. పిలకల దుంపలపై
గల పాత వేర్లను తీసివేయాలి. సాధారణంగా దేశవాళి రకాలకు దుంప 1.5-2 కేజీలు కావెండస్
రకాలకు 1.25-1.5 కేజీల బరువు ఉండటం మంచిది.
పిలకల
తయారీ మరియు నాటడం:
v పిలకల
దుంపలకు ఏమైనా దెబ్బ తగిలినచో
ఆ భాగాన్ని తీసి వేసి నాటాలి. పిలక మొక్కపై భాగంను నరికి పాతినచో అవి త్వరగా
నాటుకొని బాగా పెరుగును. పిలకలను నాటే ముందు 1% బావిస్టన్ ద్రావణంతో 5 నిమిషాలు
ఉంచిన పిమ్మట నాటాలి. అరటి ముక్కు పురుగు అధికంగా గల ప్రాంతాలలో పిలకలను 0.1%
మెటాసిస్టాక్స్ ద్రావణంలో ముంచి నాటడం మంచిది.
v తోట
వేయవల్సిన నేలను బాగా దున్ని 10-15 రోజుల పాటు అట్లాగే ఉంచి తర్వాత నేలను చదును
చేసి నిర్ణయించిన దూరంలో 45 ఘ. సెం.మీ.ల గోతులు తవ్వాలి.
v సాధారణంగా
పొట్టి రకాలకు 1.5 మీటర్ల పొడవు రకాలకు 2 మీటర్ల దూరంలో గోతులు తీసి నాటాలి.
వర్షాకాంలో అనగా జూన్-జూలై మాసాలలోనే నాటుతారు. నీటివసతిని అనుసరించి
అక్టోబర్-నవంబర్ మాసం వరకు నాటవచ్చును. నాటే ముందు గుంతలో పశువుల ఎరువు 5 కేజీలు
మరియు 5 గ్రాముల కార్బోప్యూరాన్ గుళికలు వేసి గుంత నింప వలెను. తరువాత పిలకలను
గుంత మధ్యలో దుంప మరియు 2 అడుగుల పిలక భూమిలో కప్పబడి ఉండేటట్లు నాటవలెను. నాటిన
పిమ్మట పిలకచుట్టు మట్టిని బాగా కప్పవలెను. అరటి పిలకలు నాటిన 10-15 రోజులకు
వేర్లు తొడుగును. అలా కాని యెడల 20 రోజుల తరువాత నాటిన పిలకల స్థానంలో కొత్త
పిలకలు నాటవలెను.
జంట
వరుసల వద్దతి:
v ఇటీవలి
కాలంలో అరటి మొక్కలకు జంట వరుసల పద్దతిలో నాటుతున్నారు. ఈ పద్దతిలో మొక్కలను అధిక
సాంద్రతలో నాటి తద్వారా భూమిని సమర్థవంతంగా ఉపయోగించుకొని అధిక ఫలసాయం
పొందవచ్చును.
v తెల్ల
చక్కెరకేళి, గ్రాసేన్, రోబస్టా
రకాలను 1.2X1.2X2 మీటర్ల
దూరంలో వామన కేళి రకాన్ని 1X1x1.8
మీటర్ల (వరుసల మధ్యX మొక్కల మద్య X (జంట
వరుసల మధ్య) జంట వరుసల్లో నాటేటపుడు వరుసల మధ్య దూరం (1.2 మి) తక్కువగా ఉండాలి.
రెండు జంట వరుసల మధ్య దూరం ఎక్కువగా (2 మీ.) ఉండాలి. ముందు వరుస మొక్కల మధ్యకు
వచ్చే విధంగా నాటాలి. ఎరువులు సిఫార్సు చేసిన విధంగా ప్రతిమొక్కకు ఇవ్వాలి. అధిక
సాంద్రతలో నాటినపుడు పంట కాలపరిమితి 40-50 రోజులు పెరుగుతుంది. ఎక్కువ ఎత్తు
పెరుగుతుంది. అందుకు తగిన జాగ్రత్తలు పాటించాలి.
v జంట
వరుసల మధ్యనున్న ఖాళీ భూమిలో 100-120 రోజుల కాలపరిమితి గల అంతరపంటలు (ఆకుకూరలు
క్యాబేజి, కాలీప్లవర్ మొక్కజొన్న మొ.) సాగుచేసి
అదనపు ఆదాయం పొందవచ్చు.
ఎరువులు:
v తోట నాటే
ముందు వేసే సేంద్రియ ఎరువులే కాక ఆ తర్వాత రసాయనిక ఎరువులు కూడా అరటికి అవసరం
అవుతాయి. ప్రతి మొక్కకు 200-250 గ్రాముల నత్రజని 30-40 గ్రాముల భాస్వరం, 200-250
గ్రాముల పొటాషియం అవసరం. భాస్వరం ఎరువును దుక్కిలో వేళ్ల్చి దున్నాలి. నత్రజని
పొటాష్ ఎరువులు 6 సమభాగాలుగా చేసి నాటిన 35 వ రోజు మొదలు 45 రోజుల వ్యవధిలో వేస్తూ
వుండాలి. ఎరువులు వేసిన ప్రతిసారి నీరు కట్టాలి.
అంతర
కృషి:
v ప్రతీ
15-20 రోజులకు ఒకసారి కలుపు మొక్కలను కనీసం 4 నెలల వరకు తీసివేస్తుండాలి. తోటలో
మినుము, అలసంద కూరగాయల అంతర పంటలుగా వేసుకోవచ్చు.
నీటి తడులు నాటిన వెంబడే మరియు వారంనకు ఒకసారి చొప్పున పంట కాలంలో దాదాపు 40 నీటి
తడులు యివ్వాలి. అరటికి నీరు చాలి అవసరం అయినప్పడికి మొక్కల మొదళ్ళ మధ్య నీరు
నిల్వ వుండరాదు. తోటకు తగినంత నీరు పెట్టని యెడల ఆలస్యంగా గెల తొడగుట, చిన్న
గెలలు వేయుట, గెలలు ఆలస్యంగా పక్వానికి వచ్చుట, పండ్లు
నాణ్యంగా లేకపోవుట సంభవిరమ. తదుపరి
జాగ్రత్తలు:
v అరటి
నాటిన 3-4 నెలల తర్వాత పిలకలు వృద్ధి అవుతాయి. అరటి గెల సగం తయారయ్యే వరకు పిలకలను 20-25
రోజులకొకసారి కోసి వేయాలి. పిలకలు ఎప్పటికప్పుడు కోయటం వల్ల తల్లి చెట్లు బలంగా
ఎదిగి అధిక ఫలసాయం అందిస్తుంది. బాగా పెద్దవైన పిలకలను వెడల్పాటి పదునైన గునపంతో
కొద్దిపాటి దుంపతో సహ తవ్వితీస్తే తిరిగి ఎదగదు.
v రెండవ
పంట తీసుకోవాలంటే తల్లి చెట్టుకు దూరంగా ఉన్న ఆరోగ్యవంతమయిన పిలకను ఎన్నుకొని
మిగతా వాటిని తీసివేయాలి. అరటి నాటిన 6-8 నెలల్లో చెట్టు మొదలుకు మట్టిని ఎగదోయడం
వలన చెట్టుకు బలం చేకూరుతుంది.
v
గాలులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో అరటి
చెట్టు గాలి తాకిడిని తట్టుకోవడానికి వెదురు గడలు పాతి ఊతం ఇవ్వాలి.
v గెలలు
నరికిన చెట్లను అడుగువరకు నరికి వేయాలి.
v గెల వేసి
హస్తాలు పూర్తిగా విచ్చుకున్న తర్వాత మగ పువ్వును కోసి వేయాలి. 6. మగ పువ్వును
కోసిన వెంటనే పాలిథీన్ సంచులను గెలలకు తొడిగిన యెడల పండ్లు పూర్తిగా ఏ విధమైన
మచ్చలు లేకుండా ఆకర్షణీయంగా తయారవును.
పూత
మరియు కోత:
v పంట రకం, నాటిన
సమయం మరియు భూసారం వంటి వాటిని అనుసరించి 8-10 నెలల్లో పూత గెలవస్తుంది. పూత
గెలవేసిన 2-3 నెలల్లో గెల తయారవుతుంది. పూర్తిగా తయారైన పండ్లు గుండ్రంగా ఉండి
చేతితో తట్టితో మంచి శబ్దం వస్తుంది. దూర ప్రాంతాలకు పంపేటప్పుడు గెలలను 75%–80%
పక్వానికి రాగానే కొయ్యటం మంచిది. గెల తొండం కురచగా ఉండేటట్లు నరకాలి. గెలల చుటూ
పచ్చి ఆకును చుట్టి రవాణా చేయటం మంచిది.
కాయ
పరిపక్వత:
v స్థానిక
మార్కెట్లలో అమ్మడం కోసం మూడు వంతులు ముదిరిన కాయలను, గుండ్రంగా
తయారైనప్పుడు కోయవచ్చును.
v దూర
ప్రాంతాల రవాణా కొరకు 90 శాతం ముదిరిన గెలలను, సుదూర
ప్రాంతాల రవాణా కొరకు 75-80 శాతం ముదిరిన గెలలను కోయవచ్చును.
గెలలను
కోసిన తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలు
v గెలలను
కోసిన తరువాత వెంటనే నీడలో వుంచాలి. ఎండలో వుంచరాదు. ఎండలో వుంచడం వలన కాయల లోపల
వేడిమి పెరిగి కాయలు త్వరగా పండటం ప్రారంభిస్తాయి. తద్వారా ఎక్కువకాలం నిలువ
వుంచలేము.
v వంపు
తిరిగిన పదునైన కత్తిని ఉపయోగించి 15 నుంచి 20 కాయలు వుండునట్లుగా హస్తములను అరటి
గెలల నుంచి వేరు చెయ్యాలి.ఈ విధంగా వేరు చేసిన హస్తములను నీటిలో వుంచి సొన
పూర్తిగా కారనిచ్చి, బాగా
శుభ్రపరచాలి.
v కాయలను
శుభ్రపరచుటకు 0.5 గ్రాముల బావిస్టన్ మందును లీటరు నీటికి కలిపినట్లయితే ఎలాంటి
శిలీంధ్రములు ఆశించకుండా ఎక్కువ కాలం నిలువ వుంటాయి.
v శుభ్రపరచిన
అరటి హస్తములను గాలి సోకడానికి వీలు కలిగినటువంటి ఫైబరు బోర్డు పెట్టెలలో వుంచి
ప్యాక్ చెయ్యాలి.
v లేత
కాయలు, బాగా పండిన కాయలను, ముదిరిన
కాయలతో కలిపి నిలువ వుంచరాదు.
v కాయలను
లేదా గెలలను ట్రక్కులు, రైలు పెట్టెల
ద్వారా రవాణా చేయునప్పుడు ఒక క్రమ పద్దతిలో గెలలను నిలువుగా అమర్చి, పై గెలల
బరువు క్రింద వున్నటువంటి గెలల మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
మగ్గ
వేయడం, నిలువ
వుంచడం:
v గాలి
చొరబడిని గదిలో ఉంచి పొగ సోకించి 24 గంటల సేపు ఉంచితే గెలలు పండుతాయి. కోసిన
గెలలపై 1000 ppm ఇథరెల్ మందు ద్రావణం పిచికారి
చేస్తే అరటి పండ్లకు ఆకర్షణీయమైన రంగు వస్తుంది.
v పండిన
అరటి గెలలను శీతలీకరణ గదులలో 15" సెంటీగ్రేడు ఉష్ణోగ్రత వద్ద, 85-90
శాతం గాలిలో తేమ వుండునట్లు చేసి నిలువ వుంచినట్లయితే సుమారు 3 వారముల వరకు పండ్లు
చెడిపోకుండా నిలువ వుంచవచ్చును.
v అరటి
పండ్లను 15" సెంటీగ్రేడు ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిలువ
చేయరాదు. ఇలా చేసినట్లయితే కాయలు నల్లబడి త్వరగా పాడవుతాయి.
దిగుబడి:
v సగటున ఒక
గెల 8-10 హస్తాలతో 120-150 పండ్లను కల్గిండును. సగటున గెల బరువు 15-22 కేజీలుండి ఎకరానికి
14 టన్నుల దిగుబడి నిచ్చును.