Wednesday, 1 June 2016

శ్రీ వరి సాగు

శ్రీ వరి అంటే

వరిసాగు-సిస్టమ్‌ ఆఫ్‌ రైస్‌ ఇంటెన్సిఫికేషన్‌(శ్రీ)

వరిసాగులో కొన్ని అపోహలు:
వరి జల సంబంధమైన మొక్క అని అందరికీ తెలుసు. నీటిలో పాతుకు పోతున్నప్పుడు బాగా పెరుగుతుంది. అలాగని వరి నీటి మొక్క కాదు. వేళ్ళల్లో గాలిబుడగ ఏర్పాటవడానికి వరి మొక్క ఎంతో శక్తిని వినియోగించుకోవలసి వస్తుంది. వరిలో పూత సమయంలో సుమారు 70% వేరు చివర్లు నాశనమైపోతాయు.
శ్రీ వరిసాగులో నిజంకాని అపోహలు:శ్రీ వరిసాగు పొలంలో నీరు లోతుగా ఉండనవసరం లేదు. చేను పేరిగేటప్పుడు తడిగా ఉంటే చాలు. ఆ తరువాత 2.5 సెం.మీ వరకు నీరు ఉండాలి.శ్రీ వరిసాగుకు సాంప్రదాయ పద్ధతిలో వరి చేనుకు కావలసినంత నీటి లోతులో సగమయితే చాలు. ప్రపంచ వ్యాప్తంగా ఒక లక్ష మందికి పైగా ఈ శ్రీ వరిసాగు పద్ధతిని అనుసరించి లబ్దిపొందుచున్నారు. శ్రీ వరిసాగుకు కావలసిన నీరు తక్కువగా ఉండును. పైగా ఖర్చుకూడా తక్కువే. దిగుబడి మాత్రం ఎక్కువ. చిన్న రైతులకు శ్రీ వరిసాగు ఎంతో లాభదాయకం.
తూర్పు ఆఫ్రికా సమీపంలో ఉన్న మలగాసీ దీవి(మడగాస్కర్‌) లో శ్రీ వరిసాగు పద్ధతిని మొట్టమొదట అభివృద్ధి చేశారు. చైనా, ఇండోనేషియా, కంబోడియా, థాయిలాండ్‌, బంగ్లాదేశ్, శ్రీలంక, భారతదేశం వంటి అనేక ప్రపంచ దేశాల్లో ఈ శ్రీ వరి సత్తాను పరీక్షిస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్‌ లో 22 జిల్లాల్లో 2003 ఖరీఫ్‌ సమయంలో ప్రవేశ పెట్టగా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించారు. శ్రీ వరిసాగు లో  ప్రత్యేకంగా ఏవీ వాడనవసరం లేదు. శ్రీ వరిసాగు లో విత్తనాలను 25 సెం.మీ. విస్తర్ణంలో తక్కువగా వరి మొక్కలు నాటిస్తే చాలు. సాంప్రదాయ పద్ధతిలో వరిసాగులో ఎకరానికి 20 కి.గా. విత్తనాలు వాడవలసి ఉంటుంది.
అంశాలు
సాంప్రదాయ పద్ధతిలో
శ్రీ
మధ్య దూరం
15x10 cm
25x25 cm
చదురపు మీటరు లో
66
16
విత్తే మెక్కల సంఖ్య
3
1
ఒక ఎకరంలో వచ్చే మెక్కలు
792000
64000
ఒక ఎకరానికి కావలసిన విత్తనాలు
20 kg
2 kg
శ్రీ వరిసాగులో రసాయనిక ఎరువులు, సస్యరక్షణ ముందులు వంటి వాటికి అంతగా ఖర్చు ఉండదు. సుమారుగా శ్రీవరి సాగుకు 2 కిలోల విత్తనాలు సరిపోతాయి.
వేర్లు పెరుగుదల:
శ్రీ వరిసాగు పద్ధతిలో చేను ఏపుగా పెరుగుతుంది. సహజ పద్ధతిలో దాని వేర్లు పుష్కలంగా పెరుగుతాయి. లోపలి పొరల నుండి పోషకాలను వేర్లు గ్రహిస్తాయి. ప్రారంభ దశలో శ్రీ వరిసాగుకు ఎక్కువ మంది కూలీలు అవసరమవుతారు. ఊడ్పుకు, కలుపుతీతకు 50% శ్రామిక శ్రమ అవసరం.
- లాభం పొందడానికే ఎక్కువ మంది కూలీల అవసరం.
- కుటుంబంలోని అందరూ పని చేస్తే పేదరికానికి ప్రత్యామ్నాయమౌతుంది.
- ఇప్పటి వరిసాగు పద్ధతి కంటే ఒకసారి సరియైన నైపుణ్యాన్ని నేర్చుకుని పాటించిననాడు శ్రీ వరిసాగులో కూలీ ఖర్చు తగ్గుతుంది.

ఈ క్రింద వాటితో శ్రీ వరిసాగులో వరి మొక్క ఏపుగా పెరుగుతుంది.
- వేర్లు పుష్కలంగా ఉంటాయి
- బలమైనవిగాను, విరివిగాను ఉండే పిలకలు.
- చేను పడిపోదు.
- పూత పెద్దదిగా ఉంటుంది.
- బాగా పాలుపోసుకుని గింజ కట్టి గింజ బరువుగా ఉంటుంది.
- వరి మొక్క సహజంగా పోషకాల్ని గ్రహించడంతో చీడపురుగులను దరి చేరనీయదు.
పిలకలు వేయడం-బాగా పెరుగుతుంది:
పూత ప్రారంభంతో పిలకలు వేయడం కూడా ప్రారంభమౌతుంది. పాలు బాగా పోసుకొనడంతో పూత బాగా వచ్చి గింజ కడుతుంది. చేను పడిపోదు

కాపి లింకు: 

No comments:

Post a Comment