Sunday, 5 June 2016

వేసవి దుక్కులతో లాభాలు

వేసవి దుక్కులతో లాభాలు


వర్షాధార పంటలను సకాలంలో విత్తుకుంటేనే ఆశించిన దిగుబడులను పొందవచ్చు. తొలకరిలో సకాలంలో విత్తడానికి రైతులకు తక్కువ సమయం ఉంటుంది. రుతుపవనాలు వచ్చి, వర్షాలు మొదలు కాగానే దుక్కులు తయారు చేసుకుంటే భూమిలో తేమ వృథా అవుతుంది. తగిన సమయంలో విత్తనం వేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీనికోసం ముందుగానే దుక్కలు సిద్ధం చేసుకుంటే వర్షాలు పడిన తర్వాత అదును చూసి విత్తుకునే అవకాశం ఉంటుంది.
Ø  -సాధారణంగా వర్షాధార ప్రాంతాల్లో రబీ తరువాత మళ్లీ వర్షాకాలం వచ్చే వరకు దుక్కి దున్నకుండా పొలాలను వదిలేస్తారు. ఇలా వదిలేయడం వల్ల భూమి లోపలి పొరల నుంచి నీరు ఆవిరవుతుంది.
Ø  కలుపు మొక్కలు పెరిగి నీటిని, సాంద్రతను గ్రహించి సత్తువ లేకుండా చేస్తాయి.
Ø  ఏప్రిల్, మే నెలల్లో అడపాదడపా కురిసే వానలను సద్వినియోగం చేసుకొని పొలాలను దున్నుకోవాలి.
Ø  వర్షానికి ముందే భూమి దున్నుకుంటే తొలకరి వానలతో పెళ్లలు మొత్తబడి నీరు భూమిలోకి ఇంకుతుంది. మొలక శాతం బాగుంటుంది.
Ø  వేసవిలో వాలుకు అడ్డంగా దున్నుకోవడం వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకేందుకు అనుకూల పరిస్థితులుంటాయి.-ఎక్కువ తేమ గ్రహించి నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది.
Ø  దుక్కులకు ముందు పశువుల ఎరువు, కంపోస్ట్, చెరువు మట్టి వెదజల్లడం వల్ల నేల సారవంతమవుతుంది.-భూమిలో తేమ నిలుపుకొనే శక్తి పెరుగుతుంది. ఆ తర్వాత వీలైతే పచ్చిరొట్ట విత్తనాలు చల్లుకుంటే భూసారం పెరుగుతుంది. 
Ø  వేసవి దుక్కి దున్నడానికి ముందే పొలంలో ఆవుల మందలు, గొర్రెలు, మేకల మందలు వదలాలి. అవి విసర్జించే మల మూత్రాలు భూమిలోకి చేరి సేంద్రియ పదార్థం పెరిగి భూసారం వృద్ధి చెందుతుంది. ఆ తర్వాత వేసే పంటలో సూక్ష్మ పోషక లోపాలను నివారించవచ్చు. 
Ø  నేల పైపొరలో గాలి శాతం పెరుగుతుంది. దీనివల్ల సూక్ష్మజీవుల సంఖ్య వృద్ధిచెంది, నేలలోని సేంద్రియ పదార్థం త్వరగా కుళ్లడానికి దోహదపడుతుంది.
Ø  మొక్కల వేర్లు భూమి లోపలి పొరలకు చొచ్చుకుని పోవడం వల్ల నీరు, పోషకాలు గ్రహించే అవకాశం కలుగుతుంది.కలుపు మొక్కలుంటే వేసవిలో ఎక్కువ ఉష్ణోగ్రతతో నశిస్తాయి.-తొలకరి కంటే ముందే దుక్కి చేయటం వల్ల భూమిలోని చీడ పీడలు కొశస్థ, గుడ్డు దశలు బయటపడి అధిక ఉష్ణోగ్రతతో నాశనమవుతాయి.


Ø 

No comments:

Post a Comment