Wednesday, 1 June 2016

విత్తన శుద్ధి


వ్యవసాయ విద్య కోర్సుల వివరాలు మరియు ఉపాధి అవకాశాలు

శ్రీ వరి సాగు

శ్రీ వరి అంటే

వరిసాగు-సిస్టమ్‌ ఆఫ్‌ రైస్‌ ఇంటెన్సిఫికేషన్‌(శ్రీ)

వరిసాగులో కొన్ని అపోహలు:
వరి జల సంబంధమైన మొక్క అని అందరికీ తెలుసు. నీటిలో పాతుకు పోతున్నప్పుడు బాగా పెరుగుతుంది. అలాగని వరి నీటి మొక్క కాదు. వేళ్ళల్లో గాలిబుడగ ఏర్పాటవడానికి వరి మొక్క ఎంతో శక్తిని వినియోగించుకోవలసి వస్తుంది. వరిలో పూత సమయంలో సుమారు 70% వేరు చివర్లు నాశనమైపోతాయు.
శ్రీ వరిసాగులో నిజంకాని అపోహలు:శ్రీ వరిసాగు పొలంలో నీరు లోతుగా ఉండనవసరం లేదు. చేను పేరిగేటప్పుడు తడిగా ఉంటే చాలు. ఆ తరువాత 2.5 సెం.మీ వరకు నీరు ఉండాలి.శ్రీ వరిసాగుకు సాంప్రదాయ పద్ధతిలో వరి చేనుకు కావలసినంత నీటి లోతులో సగమయితే చాలు. ప్రపంచ వ్యాప్తంగా ఒక లక్ష మందికి పైగా ఈ శ్రీ వరిసాగు పద్ధతిని అనుసరించి లబ్దిపొందుచున్నారు. శ్రీ వరిసాగుకు కావలసిన నీరు తక్కువగా ఉండును. పైగా ఖర్చుకూడా తక్కువే. దిగుబడి మాత్రం ఎక్కువ. చిన్న రైతులకు శ్రీ వరిసాగు ఎంతో లాభదాయకం.
తూర్పు ఆఫ్రికా సమీపంలో ఉన్న మలగాసీ దీవి(మడగాస్కర్‌) లో శ్రీ వరిసాగు పద్ధతిని మొట్టమొదట అభివృద్ధి చేశారు. చైనా, ఇండోనేషియా, కంబోడియా, థాయిలాండ్‌, బంగ్లాదేశ్, శ్రీలంక, భారతదేశం వంటి అనేక ప్రపంచ దేశాల్లో ఈ శ్రీ వరి సత్తాను పరీక్షిస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్‌ లో 22 జిల్లాల్లో 2003 ఖరీఫ్‌ సమయంలో ప్రవేశ పెట్టగా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించారు. శ్రీ వరిసాగు లో  ప్రత్యేకంగా ఏవీ వాడనవసరం లేదు. శ్రీ వరిసాగు లో విత్తనాలను 25 సెం.మీ. విస్తర్ణంలో తక్కువగా వరి మొక్కలు నాటిస్తే చాలు. సాంప్రదాయ పద్ధతిలో వరిసాగులో ఎకరానికి 20 కి.గా. విత్తనాలు వాడవలసి ఉంటుంది.
అంశాలు
సాంప్రదాయ పద్ధతిలో
శ్రీ
మధ్య దూరం
15x10 cm
25x25 cm
చదురపు మీటరు లో
66
16
విత్తే మెక్కల సంఖ్య
3
1
ఒక ఎకరంలో వచ్చే మెక్కలు
792000
64000
ఒక ఎకరానికి కావలసిన విత్తనాలు
20 kg
2 kg
శ్రీ వరిసాగులో రసాయనిక ఎరువులు, సస్యరక్షణ ముందులు వంటి వాటికి అంతగా ఖర్చు ఉండదు. సుమారుగా శ్రీవరి సాగుకు 2 కిలోల విత్తనాలు సరిపోతాయి.
వేర్లు పెరుగుదల:
శ్రీ వరిసాగు పద్ధతిలో చేను ఏపుగా పెరుగుతుంది. సహజ పద్ధతిలో దాని వేర్లు పుష్కలంగా పెరుగుతాయి. లోపలి పొరల నుండి పోషకాలను వేర్లు గ్రహిస్తాయి. ప్రారంభ దశలో శ్రీ వరిసాగుకు ఎక్కువ మంది కూలీలు అవసరమవుతారు. ఊడ్పుకు, కలుపుతీతకు 50% శ్రామిక శ్రమ అవసరం.
- లాభం పొందడానికే ఎక్కువ మంది కూలీల అవసరం.
- కుటుంబంలోని అందరూ పని చేస్తే పేదరికానికి ప్రత్యామ్నాయమౌతుంది.
- ఇప్పటి వరిసాగు పద్ధతి కంటే ఒకసారి సరియైన నైపుణ్యాన్ని నేర్చుకుని పాటించిననాడు శ్రీ వరిసాగులో కూలీ ఖర్చు తగ్గుతుంది.

ఈ క్రింద వాటితో శ్రీ వరిసాగులో వరి మొక్క ఏపుగా పెరుగుతుంది.
- వేర్లు పుష్కలంగా ఉంటాయి
- బలమైనవిగాను, విరివిగాను ఉండే పిలకలు.
- చేను పడిపోదు.
- పూత పెద్దదిగా ఉంటుంది.
- బాగా పాలుపోసుకుని గింజ కట్టి గింజ బరువుగా ఉంటుంది.
- వరి మొక్క సహజంగా పోషకాల్ని గ్రహించడంతో చీడపురుగులను దరి చేరనీయదు.
పిలకలు వేయడం-బాగా పెరుగుతుంది:
పూత ప్రారంభంతో పిలకలు వేయడం కూడా ప్రారంభమౌతుంది. పాలు బాగా పోసుకొనడంతో పూత బాగా వచ్చి గింజ కడుతుంది. చేను పడిపోదు

కాపి లింకు: 

Saturday, 28 May 2016

BEST FARMER SITE

BEST FARMER SITE







                                               

క్రింద ఉన్న లింకును క్లిక్ చేయండి.


సాధారణ పంటల్లో విత్తనశుద్ది

సాధారణ  పంటల్లో విత్తనశుద్ది
పురుగు మందు లేదా తెగులు మందు పొడిరూపంలో గాని, ద్రవ రూపంలో గాని, విత్తనం, నేల ద్వారా సంక్రమించే శిలీంధ్రాలు రాకుండా, విత్తనానికి పట్టించే విధానాన్ని విత్తనశుద్ధి అంటారు. కొన్ని సందర్భాలలో మందులనే కాకుండా, విత్తనాలను సూర్యరశ్మికి గురిచేయడం, వేడి నీళ్ళలో ఉంచడము కూడా విత్తనశుద్ధిగానే పరిగణిస్తారు.
విత్తనశుద్ధి ప్రయోజనాలు
Ø మొలకెత్తే విత్తనాలను/లేత మొక్కలను విత్తనము ద్వారా లేదా నేల ద్వారా సంక్రమించే శిలీంధ్రాల నుండి కాపాడుకోవచ్చు.
Ø పప్పజాతి పంట మొక్కల వేర్లపై బుడిపెల సంఖ్య పెరుగుతుంది.
Ø తక్కువ ఖర్చుతో, తెగుళ్ళు, పురుగులను అదుపులో ఉంచవచ్చు.
Ø విత్తనశుద్ధి చేసినపుడు, నిల్వ చేసినపుడు ఆశించే పురుగుల నుండి కూడా రక్షణ పొందవచ్చు.
Ø ముఖ్యంగా నేలద్వారా సంక్రమించే తెగుళ్ళను, పురుగు లను సమర్థవంతంగా నివారించవచ్చు.
Ø విత్తనం లోపల ఆశించిన శిలీంధ్ర బీజాలను నిర్మూలించడానికి విత్తనశుద్ధికి ఉపయోగించే వుందు, విత్తనం లోపలి భాగంలోకి చొచ్చుకొనిపోయి శిలీంధ్రాలు నిర్మూలించ బడుతాయి
Ø విత్తన పై భాగంలో ఆశించిన (విత్తనపు పొర) శిలీంధ్ర బీజాలను నిర్మూలించడానికి విత్తనశుద్ధి మందును, విత్తనంపై, పొడి రూపంలో గాని, లేదా ద్రవ రూపంలో కాని పట్టించినప్పుడు పై పొరల్లో ఉన్న శిలీంధ్రాలను నిర్మూలించుతుంది.
Ø విత్తనాలు/మొలకెత్తిన లేత మొక్కలు నేలలో ఉన్న శిలీంధ్రముల నుండి రక్షణ పొందుతాయి.
విత్తన శుద్ధి పద్దతులు
విత్తన సంరక్షణ
ఇది చాలా ఎక్కువగా వాడే విత్తనశుద్ధి పద్ధతి, ఈ పద్ధతిలో విత్తనానికి పొడి మందు లేదా ద్రావక మందులను విత్తనానికి సంరక్షణగా వాడతారు. దీనిని రైతులు మరియు పరిశ్రమల్లో కూడా ఉపయోగిస్తారు. ఈ పద్దతిలో మందు కలపడానికి తక్కువ ఖర్చుగల మట్టిపాత్రలను ఉపయోగిస్తారు. కొన్ని సందర్భాలలో పాలిథీన్ కవర్లను నేలపై పరిచి విత్తనాలను పోసి కావలసినంత మందును విత్తనాలపై చల్లి యాంత్రికంగా విత్తనాలను కలుపుతారు.
విత్తనాలకు పూత వేయు పద్ధతి
ఈ పద్ధతిలో మందును విత్తనాలకు పూయడానికి ఒక ప్రత్యేకమైన జిగురు పదార్ధాన్ని ఉపయోగిస్తారు. ఈ పద్ధతికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానము అవసరము. అందు వలన సాధారణంగా పరిశ్రమల్లో వాడతారు.
విత్తనశుద్ధిలో జాగ్రత్తలు
Ø విత్తనశుద్ధికి వాడే రసాయనాలు మనుషులకు మరియు పశువులకు హానికరమైనవి. విత్తనశుద్ధి చేసిన విత్తనాలను తినడానికి వాడకుండా చాలా జాగ్రత్త వహించాలి. కావున అవసరం మేరకు మాత్రమే విత్తనాన్ని కొనడం, లేదా స్వయంగా విత్తనశుద్ధి చేసుకోవడం చేయాలి.
Ø విత్తనశుద్ధికి వాడే మందును తగు మోతాదులో మాత్రమే వాడాలి. ఎక్కువ మోతాదు వలన విత్తనము మొలకశాతం దెబ్బతింటుంది. మరీ తక్కువ మోతాదు అయినపుడు, అసలు మందు పనిచేయదు.
Ø విత్తనాన్ని 8-10 శాతం పదును వరకు ఆరనిచ్చి విత్తనశుద్ధి చేయాలి. ఎక్కువ పదును ఉన్నచో కొన్ని మందులు విత్తనాన్ని పాడుచేస్తాయి.
Ø ముందు శిలీంధ్రనాశినితో విత్తనశుద్ధి చేసి తర్వాత బాక్టీరియాకు సంబంధించిన మందులతో శుద్ధి చేయాలి.
వరి విత్తన శుద్ధి
Ø కిలో వరి విత్తనానికి 3 గ్రా. కార్బండిజమ్ను కలిపి 24 గం||ల తరువాత నారు మడిలో చల్లుకోవాలి.
Ø దుంపనారు మడికైతే లీటరు నీటికి ఒక గ్రా. కార్బండిజమ్ను కలిపి విత్తనాన్ని 24 గం. నాన బెట్టి మండెకట్టి మొలక వచ్చిన తరువాత నారు మడిలో చల్లుకోవాలి.
Ø కిలో విత్తనం నానబెట్ట డానికి లీటరు నీరు సరిపోతుంది.
మొక్కజొన్న/ జొన్న / సజ్జ
Ø కిలో విత్తనానికి 3 గ్రా. మాంకోజెబ్ లేదా థైరాం లేదా కాప్టాన్తో విత్తనశుద్ధి చేసుకున్నట్లయితే లేత దశలో వెుక్కలను తెగుళ్ళ బారి నుండి కాపాడుకోవచ్చును.
కంది
Ø 5గ్రా. ట్రైకోడెర్మావిరిడి+2గ్రా. కార్భండిజమ్ కిలో విత్తనానికి చొప్పన పట్టించి ఆరబెట్టి తర్వాత రైజోబియంతో విత్తనశుద్ధి చేసుకోవచ్చు.
జాగ్రత్తలు
Ø మొదట కార్బండిజమ్తో శుద్ధి చేసి, 24 గంటలు తర్వాత ట్రైకోడెర్మాతో శుద్ధి, ఆ తర్వాత రైజోబియంతో శుద్ధి చేయాలి.
పెసర / మినుము
Ø విత్తుటకు ముందు కిలో విత్తనానికి 5 గ్రా. థయో మిథాక్సాం లేదా 5 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ లేదా 30 గ్రా. కార్బోసల్ఫాన్ పట్టించి విత్తుకోవాలి.
Ø తరువాత 2.5 గ్రా. థైరామ్ లేదా కాప్టాన్తో శుద్ధి చేసి తెగుళ్ళ బారినుండి పంటను రక్షించవచ్చు.
Ø ఈ పైరును కొత్తగా పండించేటప్పడు 200 గ్రా. రైజోబియం కల్చర్ను, ఎకరాకు సరిపడు విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడులు పొందవచ్చు.
జాగ్రత్తలు
Ø ముందుగా శిలీంధ్ర నాశినితో ఆ తర్వాత క్రిమి సంహారక మందుతో చివరగా రైజోబియంతో శుద్ధి చేయాలి.
వేరుశనగ
Ø విత్తటానికి ముందు బావిస్టిన్ 2-3 గ్రా., రాక్సిల్ 5గ్రా. కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి.
Ø వేరు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కిలో విత్తనానికి 6.5 మి.లీ. క్లోరిపైరిఫాస్ లేదా రసం పీల్చే పురుగులకు ఇమిడాక్లోప్రిడ్ 2 మి.లీ. చొప్పన కలిపి విత్తనశుద్ధి చేయాలి.
Ø వరి మాగాణుల్లో లేక కొత్తగా వేరుశనగ సాగుచేసేటపుడు 200 గ్రా. రైజోబియం కల్చరును ఎకరాకు సరిపడే విత్తనానికి పట్టించాలి.

డాక్టర్.యన్.కృష్ణ ప్రియ పి.హెచ్.డి., వ్యవసాయ విస్తరణ విభాగము

మొలకే ముఖ్యము


Thursday, 26 May 2016

రసాయన ఎరువులు CHEMICAL FERTILIZERS

రసాయన ఎరువులు
CHEMICAL FERTILIZERS

•          నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి ముఖ్య పోషకాలు మరియు ఇతర పోషకాలు ఆంగిక భాగాలు గా కలిగి వుండి, కృత్రిమంగా  తయారు చేయ బడిన లేదా రూపాంతరము చేయబడిన రసాయన పదార్ధాలను “ రసాయన ఎరువులు “ అంటారు.
•          రసాయనిక ఎరువులు 1నుండి 3 ప్రధాన పోషకాలను అధిక పరిమాణాలలో కలిగి నేలలో వేయగానే త్వరగా కరిగి మొక్కల కందించ బడుతాయి.
రసాయనిక ఎరువుల వర్గీకరణ
•          రసాయనిక ఎరువులో గల ముఖ్య పోషకాహారాన్ని బట్టి మూడు విధాలు గా వర్గీకరించారు.
•          1. సూటి ఎరువులు (straight fertilizers)
•          2. మిశ్రమ ఎరువులు (mixed fertilizers)
•          3. సంకీర్ణ ఎరువులు (complex fertilizers)

సూటి రసాయనిక ఎరువులు
•          సూటి ఎరువులో ప్రధాన పోషకాన్ని బట్టి మరల ఈ క్రింది విధం గా వర్గీకరించవచ్చు
నత్రజని ఎరువులు
భాస్వర ఎరువులు
పొటాషియం ఎరువులు
ద్వితీయ పోషక ఎరువులు
సూక్ష్మ పోషక ఎరువులు

నత్రజని ఎరువులు


1. నత్రజని ఎరువులు
          ఎరువులో రసాయన రూపాన్ని బట్టి (నైట్రేట్, అమ్మోనియా, ఏమైడ్) నత్రజని ఎరువులు నాలుగు రకాలు.
  1. నైట్రేట్ రసాయనిక ఎరువులు
  2. అమ్మోనియా రసాయనిక ఎరువులు
  3. నైట్రేట్- అమ్మోనియా రసాయనిక ఎరువులు
  4. ఎమైడ్ రసాయనిక ఎరువులు


1. నైట్రేట్ నత్రజని ఎరువులు
          నేలలో గల తేమ వలన త్వరగా కరిగి నత్రజనిని నైట్రేట్ రూపం లో మొక్కల కందిస్తుంది.
          నైట్రేట్ (NO3-) రూపం లో గల నత్రజని ని మట్టి రేణువులు పట్టి వుంచలేవు. అందువలన నీటిలో కరిగి నేల అడుగు పొరలలోనికి (leaching) పోవడం, మరియు సూర్య రశ్మి వలన వాయువు గా మారి గాలిలో కలిసి పోతుంది (volatalization)
          ఎక్కువ నష్టాలకు గురయ్యే ఈ రకపు ఎరువుల వాడకం తక్కువ.
          సాగునీటి క్రింద చేపట్టే వరి పైరు కు ఈ ఎరువులు వాడరాదు
ఉదా: కాల్షియం  నైట్రేట్ (15% N)
       సోడియం నైట్రేట్  (16 % N)

అమ్మోనియా నత్రజని ఎరువులు
          ఈ ఎరువులలో నత్రజని అమ్మోనియా (NH4+) రూపం  లో మొక్కలకు అందజేయబడుతుంది.
          అమ్మోనియా రూపంలో గల నత్రజని నైట్రేట్ రూపం వలె వృధా కాదు. అందువలన మొక్కలు చక్కగా వినియోగించుకుంటాయి. అందువలన ఈ ఎరువులను మంచి ఎరువులు గా భావించ వచ్చు
          కాలానుగుణం గా అమ్మోనియా, నైట్రేట్ గా రూపాంతరం చెందుతుంది.
          అమ్మోనియం సల్ఫేటు విత్తనం వేసేటప్పుడు గాని, పై పాటు గా గాని వేసుకోవచ్చు. కాని విత్తనం తో కలిపి వాడకూడదు.
          ఆమ్ల గుణం కలిగించే స్వభావం కలది కాబట్టి మరీ ఎక్కువగా అమ్మోనియం సల్ఫేట్ ను వేయకూడదు
          వంద కిలోల అమ్మోనియం సల్ఫేటు వల్ల ఏర్పడే ఆమ్లత్వాన్ని తటస్థం చేయడానికి 110 కిలోల కాల్షియం కార్బొనేట్ కావలసి వస్తుంది.
          అమ్మోనియం క్లోరైడ్ నేలలో గల కాల్షియం తో కలిసి కాల్షియం క్లోరైడ్ గా మారుతుంది. కాల్షియం క్లోరైడ్ నీటిలో కరిగే స్వభావం వుండడం వల్ల సులభం గా కొట్టుకు పోతుంది. అంటే అమ్మోనియం క్లోరైడ్ వేయడం వల్ల నేలలోని కాల్షియం నష్టమయ్యే అవకాశం ఉంది.
          మాగాణి పైర్లకు వేసుకోవచ్చు
          పొగాకు, ఆలుగడ్డ పైర్లకు అమ్మోనియం క్లోరైడ్ వాడకూడదు. క్లోరీన్ రెండు పైర్లకు చెడుపు చేస్తుంది పొగాకులో ఆకు నాణ్యత, ఆలుగడ్డ లో ఎక్కువ కాలం నిల్వ వుండకుండా చేస్తుంది.
          ఉదా: అమ్మోనియం సల్ఫేట్ (21% N,  24% S)
          అమ్మోనియం క్లోరైడ్ (25 %N)


నైట్రేట్ అమ్మోనియా ఎరువులు
          ఈ ఎరువులలో కొంత నత్రజని నైట్రేట్ రూపం లోనూ, మిగిలినది అమ్మోనియా రూపం లోనూ ఉంటుంది.
          ఆరుతడి పంటలలో ఈ ఎరువు వాడినపుడు నైట్రేట్ రూపంలో ఉన్న నత్రజని త్వరగా మొక్కలకు అందించబడి అమ్మోనియా రూపంలో గల నత్రజని నెమ్మదిగా మొక్కలకు అందించ బడుతుంది
          పోషక వినిమయ సామర్ద్యం ఎక్కువగా వుంటుంది.
          కాల్షియం అమ్మోనియం నైట్రేట్ తేమను సులభం గా పీల్చుకొంటుంది. కనుక ప్రత్యెక గోతాలలో నిల్వ చేయాలి
          ఇందులో నత్రజని సగ భాగం అమ్మోనియా రూపం లో సగ భాగం నైట్రేట్ రూపం లో ఉంటుంది.
          ఇది తటస్థం గా ఉండే ఎరువు.
ఉదా: అమ్మోనియం నైట్రేట్ (33%N)
         కాల్షియం అమ్మోనియం నైట్రేట్ (CAN) (20.5%N)
         అమ్మోనియం సల్ఫేట్ నైట్రేట్ (ASN) (26%N)

ఎమైడ్ నత్రజని ఎరువులు
          నత్రజని ఎమైడ్ (NH2)  లేదా సైనమైడ్ (CN2) రూపం లో వుంటుంది.
          ఏమైడ్ నత్రజని ఎరువులలో యూరియా బహుళ ప్రాచుర్యం పొందిన ఎరువు
          గాలిలో తేమను సులభం గా పీల్చి గడ్డ కడుతుంది
          మాగాణి లో వేసేటప్పుడు కొంత నత్రజని కొట్టుకు పోవచ్చు. మెట్టలో కూడా పై పొరల లోని నత్రజని ఆవిరై నష్టం కావచ్చు కాబట్టి యూరియా వేసినపుడు అది నేలలో బాగాకలిసే టట్లు జాగ్రత్త పడాలి
          కొద్దిగా ఆమ్లత్వం ఏర్పడ వచ్చు
          ఈ ఎరువును నీటిలో కరిగించి మొక్కలపై పిచికారి చేసిన నత్రజని శీఘ్ర గతిన మొక్కలు తీసుకొంటాయి (2 శాతం అనగా 20 గ్రా / లీ)
          నీటిలో కలిపి పిచికారీ చేసినప్పుడు అధిక గాడత కలిగియున్న ఆకులు మాదిపోతాయి. మరియు యూరియాలో బై యూరేట్అనే పైరు కు హాని చేసే పదార్ధముంటుంది. ఇది 1.5 % మించ కుండా వున్నపుడే యూరియా స్ప్రే పనికి వస్తుంది.