1. నత్రజని ఎరువులు
• ఎరువులో రసాయన రూపాన్ని బట్టి (నైట్రేట్, అమ్మోనియా, ఏమైడ్) నత్రజని ఎరువులు నాలుగు రకాలు.
- నైట్రేట్ రసాయనిక ఎరువులు
- అమ్మోనియా రసాయనిక ఎరువులు
- నైట్రేట్- అమ్మోనియా రసాయనిక ఎరువులు
- ఎమైడ్ రసాయనిక ఎరువులు
1. నైట్రేట్ నత్రజని ఎరువులు
• నేలలో గల తేమ వలన త్వరగా కరిగి నత్రజనిని నైట్రేట్ రూపం లో మొక్కల కందిస్తుంది.
• నైట్రేట్ (NO3-) రూపం లో గల నత్రజని ని మట్టి రేణువులు పట్టి వుంచలేవు. అందువలన నీటిలో కరిగి నేల అడుగు పొరలలోనికి (leaching) పోవడం, మరియు సూర్య రశ్మి వలన వాయువు గా మారి గాలిలో కలిసి పోతుంది (volatalization)
• ఎక్కువ నష్టాలకు గురయ్యే ఈ రకపు ఎరువుల వాడకం తక్కువ.
• సాగునీటి క్రింద చేపట్టే వరి పైరు కు ఈ ఎరువులు వాడరాదు
ఉదా: కాల్షియం నైట్రేట్ (15% N)
సోడియం నైట్రేట్ (16 % N)
అమ్మోనియా నత్రజని ఎరువులు
• ఈ ఎరువులలో నత్రజని అమ్మోనియా (NH4+) రూపం లో మొక్కలకు అందజేయబడుతుంది.
• అమ్మోనియా రూపంలో గల నత్రజని నైట్రేట్ రూపం వలె వృధా కాదు. అందువలన మొక్కలు చక్కగా వినియోగించుకుంటాయి. అందువలన ఈ ఎరువులను మంచి ఎరువులు గా భావించ వచ్చు
• కాలానుగుణం గా అమ్మోనియా, నైట్రేట్ గా రూపాంతరం చెందుతుంది.
• అమ్మోనియం సల్ఫేటు విత్తనం వేసేటప్పుడు గాని, పై పాటు గా గాని వేసుకోవచ్చు. కాని విత్తనం తో కలిపి వాడకూడదు.
• ఆమ్ల గుణం కలిగించే స్వభావం కలది కాబట్టి మరీ ఎక్కువగా అమ్మోనియం సల్ఫేట్ ను వేయకూడదు
• వంద కిలోల అమ్మోనియం సల్ఫేటు వల్ల ఏర్పడే ఆమ్లత్వాన్ని తటస్థం చేయడానికి 110 కిలోల కాల్షియం కార్బొనేట్ కావలసి వస్తుంది.
• అమ్మోనియం క్లోరైడ్ నేలలో గల కాల్షియం తో కలిసి కాల్షియం క్లోరైడ్ గా మారుతుంది. కాల్షియం క్లోరైడ్ నీటిలో కరిగే స్వభావం వుండడం వల్ల సులభం గా కొట్టుకు పోతుంది. అంటే అమ్మోనియం క్లోరైడ్ వేయడం వల్ల నేలలోని కాల్షియం నష్టమయ్యే అవకాశం ఉంది.
• మాగాణి పైర్లకు వేసుకోవచ్చు
• పొగాకు, ఆలుగడ్డ పైర్లకు అమ్మోనియం క్లోరైడ్ వాడకూడదు. క్లోరీన్ రెండు పైర్లకు చెడుపు చేస్తుంది పొగాకులో ఆకు నాణ్యత, ఆలుగడ్డ లో ఎక్కువ కాలం నిల్వ వుండకుండా చేస్తుంది.
• ఉదా: అమ్మోనియం సల్ఫేట్ (21% N, 24% S)
• అమ్మోనియం క్లోరైడ్ (25 %N)
నైట్రేట్ అమ్మోనియా ఎరువులు
• ఈ ఎరువులలో కొంత నత్రజని నైట్రేట్ రూపం లోనూ, మిగిలినది అమ్మోనియా రూపం లోనూ ఉంటుంది.
• ఆరుతడి పంటలలో ఈ ఎరువు వాడినపుడు నైట్రేట్ రూపంలో ఉన్న నత్రజని త్వరగా మొక్కలకు అందించబడి అమ్మోనియా రూపంలో గల నత్రజని నెమ్మదిగా మొక్కలకు అందించ బడుతుంది
• పోషక వినిమయ సామర్ద్యం ఎక్కువగా వుంటుంది.
• కాల్షియం అమ్మోనియం నైట్రేట్ తేమను సులభం గా పీల్చుకొంటుంది. కనుక ప్రత్యెక గోతాలలో నిల్వ చేయాలి
• ఇందులో నత్రజని సగ భాగం అమ్మోనియా రూపం లో సగ భాగం నైట్రేట్ రూపం లో ఉంటుంది.
• ఇది తటస్థం గా ఉండే ఎరువు.
ఉదా: అమ్మోనియం నైట్రేట్ (33%N)
కాల్షియం అమ్మోనియం నైట్రేట్ (CAN) (20.5%N)
అమ్మోనియం సల్ఫేట్ నైట్రేట్ (ASN) (26%N)
ఎమైడ్ నత్రజని ఎరువులు
• నత్రజని ఎమైడ్ (NH2) లేదా సైనమైడ్ (CN2) రూపం లో వుంటుంది.
• ఏమైడ్ నత్రజని ఎరువులలో యూరియా బహుళ ప్రాచుర్యం పొందిన ఎరువు
• గాలిలో తేమను సులభం గా పీల్చి గడ్డ కడుతుంది
• మాగాణి లో వేసేటప్పుడు కొంత నత్రజని కొట్టుకు పోవచ్చు. మెట్టలో కూడా పై పొరల లోని నత్రజని ఆవిరై నష్టం కావచ్చు కాబట్టి యూరియా వేసినపుడు అది నేలలో బాగాకలిసే టట్లు జాగ్రత్త పడాలి
• కొద్దిగా ఆమ్లత్వం ఏర్పడ వచ్చు
• ఈ ఎరువును నీటిలో కరిగించి మొక్కలపై పిచికారి చేసిన నత్రజని శీఘ్ర గతిన మొక్కలు తీసుకొంటాయి (2 శాతం అనగా 20 గ్రా / లీ)
• నీటిలో కలిపి పిచికారీ చేసినప్పుడు అధిక గాడత కలిగియున్న ఆకులు మాదిపోతాయి. మరియు యూరియాలో “బై యూరేట్”అనే పైరు కు హాని చేసే పదార్ధముంటుంది. ఇది 1.5 % మించ కుండా వున్నపుడే యూరియా స్ప్రే పనికి వస్తుంది.
No comments:
Post a Comment