సాధారణ
పంటల్లో విత్తనశుద్ది
పురుగు మందు లేదా తెగులు
మందు పొడిరూపంలో గాని, ద్రవ రూపంలో గాని, విత్తనం,
నేల ద్వారా సంక్రమించే శిలీంధ్రాలు రాకుండా, విత్తనానికి
పట్టించే విధానాన్ని విత్తనశుద్ధి అంటారు. కొన్ని సందర్భాలలో మందులనే కాకుండా,
విత్తనాలను సూర్యరశ్మికి గురిచేయడం, వేడి
నీళ్ళలో ఉంచడము కూడా విత్తనశుద్ధిగానే పరిగణిస్తారు.
విత్తనశుద్ధి
ప్రయోజనాలు
Ø మొలకెత్తే
విత్తనాలను/లేత మొక్కలను విత్తనము ద్వారా లేదా నేల ద్వారా సంక్రమించే శిలీంధ్రాల
నుండి కాపాడుకోవచ్చు.
Ø పప్పజాతి
పంట మొక్కల వేర్లపై బుడిపెల సంఖ్య
పెరుగుతుంది.
Ø తక్కువ
ఖర్చుతో, తెగుళ్ళు, పురుగులను అదుపులో
ఉంచవచ్చు.
Ø విత్తనశుద్ధి
చేసినపుడు, నిల్వ చేసినపుడు ఆశించే పురుగుల నుండి కూడా రక్షణ
పొందవచ్చు.
Ø ముఖ్యంగా
నేలద్వారా సంక్రమించే తెగుళ్ళను, పురుగు లను సమర్థవంతంగా
నివారించవచ్చు.
Ø విత్తనం
లోపల ఆశించిన శిలీంధ్ర బీజాలను నిర్మూలించడానికి
విత్తనశుద్ధికి ఉపయోగించే వుందు, విత్తనం లోపలి
భాగంలోకి చొచ్చుకొనిపోయి శిలీంధ్రాలు నిర్మూలించ బడుతాయి
Ø విత్తన
పై భాగంలో ఆశించిన (విత్తనపు పొర) శిలీంధ్ర బీజాలను నిర్మూలించడానికి విత్తనశుద్ధి
మందును, విత్తనంపై, పొడి రూపంలో గాని,
లేదా ద్రవ రూపంలో కాని పట్టించినప్పుడు పై పొరల్లో ఉన్న
శిలీంధ్రాలను నిర్మూలించుతుంది.
Ø విత్తనాలు/మొలకెత్తిన
లేత మొక్కలు నేలలో ఉన్న శిలీంధ్రముల నుండి రక్షణ పొందుతాయి.
విత్తన
శుద్ధి పద్దతులు
విత్తన సంరక్షణ
ఇది చాలా ఎక్కువగా వాడే
విత్తనశుద్ధి పద్ధతి, ఈ పద్ధతిలో విత్తనానికి పొడి మందు లేదా ద్రావక
మందులను విత్తనానికి సంరక్షణగా వాడతారు. దీనిని రైతులు మరియు పరిశ్రమల్లో కూడా
ఉపయోగిస్తారు. ఈ పద్దతిలో మందు కలపడానికి తక్కువ ఖర్చుగల మట్టిపాత్రలను
ఉపయోగిస్తారు. కొన్ని సందర్భాలలో పాలిథీన్ కవర్లను నేలపై పరిచి విత్తనాలను పోసి కావలసినంత
మందును విత్తనాలపై చల్లి యాంత్రికంగా విత్తనాలను కలుపుతారు.
విత్తనాలకు పూత వేయు
పద్ధతి
ఈ పద్ధతిలో మందును
విత్తనాలకు పూయడానికి ఒక ప్రత్యేకమైన జిగురు పదార్ధాన్ని ఉపయోగిస్తారు. ఈ పద్ధతికి
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానము అవసరము. అందు వలన సాధారణంగా పరిశ్రమల్లో వాడతారు.
విత్తనశుద్ధిలో
జాగ్రత్తలు
Ø విత్తనశుద్ధికి
వాడే రసాయనాలు మనుషులకు మరియు పశువులకు హానికరమైనవి. విత్తనశుద్ధి చేసిన
విత్తనాలను తినడానికి వాడకుండా చాలా జాగ్రత్త వహించాలి. కావున అవసరం మేరకు మాత్రమే
విత్తనాన్ని కొనడం, లేదా స్వయంగా విత్తనశుద్ధి చేసుకోవడం చేయాలి.
Ø విత్తనశుద్ధికి
వాడే మందును తగు మోతాదులో మాత్రమే వాడాలి. ఎక్కువ మోతాదు వలన విత్తనము మొలకశాతం
దెబ్బతింటుంది. మరీ తక్కువ మోతాదు అయినపుడు, అసలు మందు
పనిచేయదు.
Ø విత్తనాన్ని
8-10 శాతం పదును వరకు ఆరనిచ్చి విత్తనశుద్ధి చేయాలి.
ఎక్కువ పదును ఉన్నచో కొన్ని మందులు విత్తనాన్ని పాడుచేస్తాయి.
Ø ముందు
శిలీంధ్రనాశినితో విత్తనశుద్ధి చేసి తర్వాత బాక్టీరియాకు సంబంధించిన మందులతో
శుద్ధి చేయాలి.
వరి విత్తన శుద్ధి
Ø కిలో
వరి విత్తనానికి 3 గ్రా. కార్బండిజమ్ను కలిపి 24 గం||ల తరువాత నారు మడిలో చల్లుకోవాలి.
Ø దుంపనారు
మడికైతే లీటరు నీటికి ఒక గ్రా. కార్బండిజమ్ను కలిపి విత్తనాన్ని 24 గం. నాన బెట్టి మండెకట్టి మొలక వచ్చిన తరువాత నారు మడిలో చల్లుకోవాలి.
Ø కిలో
విత్తనం నానబెట్ట డానికి లీటరు నీరు సరిపోతుంది.
మొక్కజొన్న/ జొన్న /
సజ్జ
Ø కిలో
విత్తనానికి 3 గ్రా. మాంకోజెబ్ లేదా థైరాం లేదా కాప్టాన్తో
విత్తనశుద్ధి చేసుకున్నట్లయితే లేత
దశలో వెుక్కలను తెగుళ్ళ బారి నుండి కాపాడుకోవచ్చును.
కంది
Ø 5గ్రా. ట్రైకోడెర్మావిరిడి+2గ్రా. కార్భండిజమ్ కిలో విత్తనానికి చొప్పన పట్టించి ఆరబెట్టి తర్వాత రైజోబియంతో
విత్తనశుద్ధి చేసుకోవచ్చు.
జాగ్రత్తలు
Ø మొదట
కార్బండిజమ్తో శుద్ధి చేసి, 24 గంటలు తర్వాత ట్రైకోడెర్మాతో శుద్ధి, ఆ తర్వాత రైజోబియంతో శుద్ధి చేయాలి.
పెసర / మినుము
Ø విత్తుటకు
ముందు కిలో విత్తనానికి 5 గ్రా. థయో మిథాక్సాం లేదా 5 మి.లీ.
ఇమిడాక్లోప్రిడ్ లేదా 30 గ్రా. కార్బోసల్ఫాన్ పట్టించి
విత్తుకోవాలి.
Ø తరువాత
2.5 గ్రా. థైరామ్ లేదా కాప్టాన్తో శుద్ధి చేసి తెగుళ్ళ
బారినుండి పంటను రక్షించవచ్చు.
Ø ఈ
పైరును కొత్తగా పండించేటప్పడు 200 గ్రా. రైజోబియం కల్చర్ను,
ఎకరాకు సరిపడు విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడులు పొందవచ్చు.
జాగ్రత్తలు
Ø ముందుగా
శిలీంధ్ర నాశినితో ఆ తర్వాత క్రిమి సంహారక మందుతో చివరగా రైజోబియంతో శుద్ధి
చేయాలి.
వేరుశనగ
Ø విత్తటానికి
ముందు బావిస్టిన్ 2-3 గ్రా., రాక్సిల్ 5గ్రా. కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి.
Ø వేరు
పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కిలో విత్తనానికి 6.5 మి.లీ. క్లోరిపైరిఫాస్ లేదా రసం పీల్చే పురుగులకు ఇమిడాక్లోప్రిడ్ 2
మి.లీ. చొప్పన కలిపి విత్తనశుద్ధి చేయాలి.
Ø వరి
మాగాణుల్లో లేక కొత్తగా వేరుశనగ సాగుచేసేటపుడు 200 గ్రా.
రైజోబియం కల్చరును ఎకరాకు సరిపడే విత్తనానికి పట్టించాలి.
డాక్టర్.యన్.కృష్ణ ప్రియ పి.హెచ్.డి., వ్యవసాయ విస్తరణ
విభాగము
No comments:
Post a Comment