Saturday, 28 May 2016

BEST FARMER SITE

BEST FARMER SITE







                                               

క్రింద ఉన్న లింకును క్లిక్ చేయండి.


సాధారణ పంటల్లో విత్తనశుద్ది

సాధారణ  పంటల్లో విత్తనశుద్ది
పురుగు మందు లేదా తెగులు మందు పొడిరూపంలో గాని, ద్రవ రూపంలో గాని, విత్తనం, నేల ద్వారా సంక్రమించే శిలీంధ్రాలు రాకుండా, విత్తనానికి పట్టించే విధానాన్ని విత్తనశుద్ధి అంటారు. కొన్ని సందర్భాలలో మందులనే కాకుండా, విత్తనాలను సూర్యరశ్మికి గురిచేయడం, వేడి నీళ్ళలో ఉంచడము కూడా విత్తనశుద్ధిగానే పరిగణిస్తారు.
విత్తనశుద్ధి ప్రయోజనాలు
Ø మొలకెత్తే విత్తనాలను/లేత మొక్కలను విత్తనము ద్వారా లేదా నేల ద్వారా సంక్రమించే శిలీంధ్రాల నుండి కాపాడుకోవచ్చు.
Ø పప్పజాతి పంట మొక్కల వేర్లపై బుడిపెల సంఖ్య పెరుగుతుంది.
Ø తక్కువ ఖర్చుతో, తెగుళ్ళు, పురుగులను అదుపులో ఉంచవచ్చు.
Ø విత్తనశుద్ధి చేసినపుడు, నిల్వ చేసినపుడు ఆశించే పురుగుల నుండి కూడా రక్షణ పొందవచ్చు.
Ø ముఖ్యంగా నేలద్వారా సంక్రమించే తెగుళ్ళను, పురుగు లను సమర్థవంతంగా నివారించవచ్చు.
Ø విత్తనం లోపల ఆశించిన శిలీంధ్ర బీజాలను నిర్మూలించడానికి విత్తనశుద్ధికి ఉపయోగించే వుందు, విత్తనం లోపలి భాగంలోకి చొచ్చుకొనిపోయి శిలీంధ్రాలు నిర్మూలించ బడుతాయి
Ø విత్తన పై భాగంలో ఆశించిన (విత్తనపు పొర) శిలీంధ్ర బీజాలను నిర్మూలించడానికి విత్తనశుద్ధి మందును, విత్తనంపై, పొడి రూపంలో గాని, లేదా ద్రవ రూపంలో కాని పట్టించినప్పుడు పై పొరల్లో ఉన్న శిలీంధ్రాలను నిర్మూలించుతుంది.
Ø విత్తనాలు/మొలకెత్తిన లేత మొక్కలు నేలలో ఉన్న శిలీంధ్రముల నుండి రక్షణ పొందుతాయి.
విత్తన శుద్ధి పద్దతులు
విత్తన సంరక్షణ
ఇది చాలా ఎక్కువగా వాడే విత్తనశుద్ధి పద్ధతి, ఈ పద్ధతిలో విత్తనానికి పొడి మందు లేదా ద్రావక మందులను విత్తనానికి సంరక్షణగా వాడతారు. దీనిని రైతులు మరియు పరిశ్రమల్లో కూడా ఉపయోగిస్తారు. ఈ పద్దతిలో మందు కలపడానికి తక్కువ ఖర్చుగల మట్టిపాత్రలను ఉపయోగిస్తారు. కొన్ని సందర్భాలలో పాలిథీన్ కవర్లను నేలపై పరిచి విత్తనాలను పోసి కావలసినంత మందును విత్తనాలపై చల్లి యాంత్రికంగా విత్తనాలను కలుపుతారు.
విత్తనాలకు పూత వేయు పద్ధతి
ఈ పద్ధతిలో మందును విత్తనాలకు పూయడానికి ఒక ప్రత్యేకమైన జిగురు పదార్ధాన్ని ఉపయోగిస్తారు. ఈ పద్ధతికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానము అవసరము. అందు వలన సాధారణంగా పరిశ్రమల్లో వాడతారు.
విత్తనశుద్ధిలో జాగ్రత్తలు
Ø విత్తనశుద్ధికి వాడే రసాయనాలు మనుషులకు మరియు పశువులకు హానికరమైనవి. విత్తనశుద్ధి చేసిన విత్తనాలను తినడానికి వాడకుండా చాలా జాగ్రత్త వహించాలి. కావున అవసరం మేరకు మాత్రమే విత్తనాన్ని కొనడం, లేదా స్వయంగా విత్తనశుద్ధి చేసుకోవడం చేయాలి.
Ø విత్తనశుద్ధికి వాడే మందును తగు మోతాదులో మాత్రమే వాడాలి. ఎక్కువ మోతాదు వలన విత్తనము మొలకశాతం దెబ్బతింటుంది. మరీ తక్కువ మోతాదు అయినపుడు, అసలు మందు పనిచేయదు.
Ø విత్తనాన్ని 8-10 శాతం పదును వరకు ఆరనిచ్చి విత్తనశుద్ధి చేయాలి. ఎక్కువ పదును ఉన్నచో కొన్ని మందులు విత్తనాన్ని పాడుచేస్తాయి.
Ø ముందు శిలీంధ్రనాశినితో విత్తనశుద్ధి చేసి తర్వాత బాక్టీరియాకు సంబంధించిన మందులతో శుద్ధి చేయాలి.
వరి విత్తన శుద్ధి
Ø కిలో వరి విత్తనానికి 3 గ్రా. కార్బండిజమ్ను కలిపి 24 గం||ల తరువాత నారు మడిలో చల్లుకోవాలి.
Ø దుంపనారు మడికైతే లీటరు నీటికి ఒక గ్రా. కార్బండిజమ్ను కలిపి విత్తనాన్ని 24 గం. నాన బెట్టి మండెకట్టి మొలక వచ్చిన తరువాత నారు మడిలో చల్లుకోవాలి.
Ø కిలో విత్తనం నానబెట్ట డానికి లీటరు నీరు సరిపోతుంది.
మొక్కజొన్న/ జొన్న / సజ్జ
Ø కిలో విత్తనానికి 3 గ్రా. మాంకోజెబ్ లేదా థైరాం లేదా కాప్టాన్తో విత్తనశుద్ధి చేసుకున్నట్లయితే లేత దశలో వెుక్కలను తెగుళ్ళ బారి నుండి కాపాడుకోవచ్చును.
కంది
Ø 5గ్రా. ట్రైకోడెర్మావిరిడి+2గ్రా. కార్భండిజమ్ కిలో విత్తనానికి చొప్పన పట్టించి ఆరబెట్టి తర్వాత రైజోబియంతో విత్తనశుద్ధి చేసుకోవచ్చు.
జాగ్రత్తలు
Ø మొదట కార్బండిజమ్తో శుద్ధి చేసి, 24 గంటలు తర్వాత ట్రైకోడెర్మాతో శుద్ధి, ఆ తర్వాత రైజోబియంతో శుద్ధి చేయాలి.
పెసర / మినుము
Ø విత్తుటకు ముందు కిలో విత్తనానికి 5 గ్రా. థయో మిథాక్సాం లేదా 5 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ లేదా 30 గ్రా. కార్బోసల్ఫాన్ పట్టించి విత్తుకోవాలి.
Ø తరువాత 2.5 గ్రా. థైరామ్ లేదా కాప్టాన్తో శుద్ధి చేసి తెగుళ్ళ బారినుండి పంటను రక్షించవచ్చు.
Ø ఈ పైరును కొత్తగా పండించేటప్పడు 200 గ్రా. రైజోబియం కల్చర్ను, ఎకరాకు సరిపడు విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడులు పొందవచ్చు.
జాగ్రత్తలు
Ø ముందుగా శిలీంధ్ర నాశినితో ఆ తర్వాత క్రిమి సంహారక మందుతో చివరగా రైజోబియంతో శుద్ధి చేయాలి.
వేరుశనగ
Ø విత్తటానికి ముందు బావిస్టిన్ 2-3 గ్రా., రాక్సిల్ 5గ్రా. కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి.
Ø వేరు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కిలో విత్తనానికి 6.5 మి.లీ. క్లోరిపైరిఫాస్ లేదా రసం పీల్చే పురుగులకు ఇమిడాక్లోప్రిడ్ 2 మి.లీ. చొప్పన కలిపి విత్తనశుద్ధి చేయాలి.
Ø వరి మాగాణుల్లో లేక కొత్తగా వేరుశనగ సాగుచేసేటపుడు 200 గ్రా. రైజోబియం కల్చరును ఎకరాకు సరిపడే విత్తనానికి పట్టించాలి.

డాక్టర్.యన్.కృష్ణ ప్రియ పి.హెచ్.డి., వ్యవసాయ విస్తరణ విభాగము

మొలకే ముఖ్యము


Thursday, 26 May 2016

రసాయన ఎరువులు CHEMICAL FERTILIZERS

రసాయన ఎరువులు
CHEMICAL FERTILIZERS

•          నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి ముఖ్య పోషకాలు మరియు ఇతర పోషకాలు ఆంగిక భాగాలు గా కలిగి వుండి, కృత్రిమంగా  తయారు చేయ బడిన లేదా రూపాంతరము చేయబడిన రసాయన పదార్ధాలను “ రసాయన ఎరువులు “ అంటారు.
•          రసాయనిక ఎరువులు 1నుండి 3 ప్రధాన పోషకాలను అధిక పరిమాణాలలో కలిగి నేలలో వేయగానే త్వరగా కరిగి మొక్కల కందించ బడుతాయి.
రసాయనిక ఎరువుల వర్గీకరణ
•          రసాయనిక ఎరువులో గల ముఖ్య పోషకాహారాన్ని బట్టి మూడు విధాలు గా వర్గీకరించారు.
•          1. సూటి ఎరువులు (straight fertilizers)
•          2. మిశ్రమ ఎరువులు (mixed fertilizers)
•          3. సంకీర్ణ ఎరువులు (complex fertilizers)

సూటి రసాయనిక ఎరువులు
•          సూటి ఎరువులో ప్రధాన పోషకాన్ని బట్టి మరల ఈ క్రింది విధం గా వర్గీకరించవచ్చు
నత్రజని ఎరువులు
భాస్వర ఎరువులు
పొటాషియం ఎరువులు
ద్వితీయ పోషక ఎరువులు
సూక్ష్మ పోషక ఎరువులు

నత్రజని ఎరువులు


1. నత్రజని ఎరువులు
          ఎరువులో రసాయన రూపాన్ని బట్టి (నైట్రేట్, అమ్మోనియా, ఏమైడ్) నత్రజని ఎరువులు నాలుగు రకాలు.
  1. నైట్రేట్ రసాయనిక ఎరువులు
  2. అమ్మోనియా రసాయనిక ఎరువులు
  3. నైట్రేట్- అమ్మోనియా రసాయనిక ఎరువులు
  4. ఎమైడ్ రసాయనిక ఎరువులు


1. నైట్రేట్ నత్రజని ఎరువులు
          నేలలో గల తేమ వలన త్వరగా కరిగి నత్రజనిని నైట్రేట్ రూపం లో మొక్కల కందిస్తుంది.
          నైట్రేట్ (NO3-) రూపం లో గల నత్రజని ని మట్టి రేణువులు పట్టి వుంచలేవు. అందువలన నీటిలో కరిగి నేల అడుగు పొరలలోనికి (leaching) పోవడం, మరియు సూర్య రశ్మి వలన వాయువు గా మారి గాలిలో కలిసి పోతుంది (volatalization)
          ఎక్కువ నష్టాలకు గురయ్యే ఈ రకపు ఎరువుల వాడకం తక్కువ.
          సాగునీటి క్రింద చేపట్టే వరి పైరు కు ఈ ఎరువులు వాడరాదు
ఉదా: కాల్షియం  నైట్రేట్ (15% N)
       సోడియం నైట్రేట్  (16 % N)

అమ్మోనియా నత్రజని ఎరువులు
          ఈ ఎరువులలో నత్రజని అమ్మోనియా (NH4+) రూపం  లో మొక్కలకు అందజేయబడుతుంది.
          అమ్మోనియా రూపంలో గల నత్రజని నైట్రేట్ రూపం వలె వృధా కాదు. అందువలన మొక్కలు చక్కగా వినియోగించుకుంటాయి. అందువలన ఈ ఎరువులను మంచి ఎరువులు గా భావించ వచ్చు
          కాలానుగుణం గా అమ్మోనియా, నైట్రేట్ గా రూపాంతరం చెందుతుంది.
          అమ్మోనియం సల్ఫేటు విత్తనం వేసేటప్పుడు గాని, పై పాటు గా గాని వేసుకోవచ్చు. కాని విత్తనం తో కలిపి వాడకూడదు.
          ఆమ్ల గుణం కలిగించే స్వభావం కలది కాబట్టి మరీ ఎక్కువగా అమ్మోనియం సల్ఫేట్ ను వేయకూడదు
          వంద కిలోల అమ్మోనియం సల్ఫేటు వల్ల ఏర్పడే ఆమ్లత్వాన్ని తటస్థం చేయడానికి 110 కిలోల కాల్షియం కార్బొనేట్ కావలసి వస్తుంది.
          అమ్మోనియం క్లోరైడ్ నేలలో గల కాల్షియం తో కలిసి కాల్షియం క్లోరైడ్ గా మారుతుంది. కాల్షియం క్లోరైడ్ నీటిలో కరిగే స్వభావం వుండడం వల్ల సులభం గా కొట్టుకు పోతుంది. అంటే అమ్మోనియం క్లోరైడ్ వేయడం వల్ల నేలలోని కాల్షియం నష్టమయ్యే అవకాశం ఉంది.
          మాగాణి పైర్లకు వేసుకోవచ్చు
          పొగాకు, ఆలుగడ్డ పైర్లకు అమ్మోనియం క్లోరైడ్ వాడకూడదు. క్లోరీన్ రెండు పైర్లకు చెడుపు చేస్తుంది పొగాకులో ఆకు నాణ్యత, ఆలుగడ్డ లో ఎక్కువ కాలం నిల్వ వుండకుండా చేస్తుంది.
          ఉదా: అమ్మోనియం సల్ఫేట్ (21% N,  24% S)
          అమ్మోనియం క్లోరైడ్ (25 %N)


నైట్రేట్ అమ్మోనియా ఎరువులు
          ఈ ఎరువులలో కొంత నత్రజని నైట్రేట్ రూపం లోనూ, మిగిలినది అమ్మోనియా రూపం లోనూ ఉంటుంది.
          ఆరుతడి పంటలలో ఈ ఎరువు వాడినపుడు నైట్రేట్ రూపంలో ఉన్న నత్రజని త్వరగా మొక్కలకు అందించబడి అమ్మోనియా రూపంలో గల నత్రజని నెమ్మదిగా మొక్కలకు అందించ బడుతుంది
          పోషక వినిమయ సామర్ద్యం ఎక్కువగా వుంటుంది.
          కాల్షియం అమ్మోనియం నైట్రేట్ తేమను సులభం గా పీల్చుకొంటుంది. కనుక ప్రత్యెక గోతాలలో నిల్వ చేయాలి
          ఇందులో నత్రజని సగ భాగం అమ్మోనియా రూపం లో సగ భాగం నైట్రేట్ రూపం లో ఉంటుంది.
          ఇది తటస్థం గా ఉండే ఎరువు.
ఉదా: అమ్మోనియం నైట్రేట్ (33%N)
         కాల్షియం అమ్మోనియం నైట్రేట్ (CAN) (20.5%N)
         అమ్మోనియం సల్ఫేట్ నైట్రేట్ (ASN) (26%N)

ఎమైడ్ నత్రజని ఎరువులు
          నత్రజని ఎమైడ్ (NH2)  లేదా సైనమైడ్ (CN2) రూపం లో వుంటుంది.
          ఏమైడ్ నత్రజని ఎరువులలో యూరియా బహుళ ప్రాచుర్యం పొందిన ఎరువు
          గాలిలో తేమను సులభం గా పీల్చి గడ్డ కడుతుంది
          మాగాణి లో వేసేటప్పుడు కొంత నత్రజని కొట్టుకు పోవచ్చు. మెట్టలో కూడా పై పొరల లోని నత్రజని ఆవిరై నష్టం కావచ్చు కాబట్టి యూరియా వేసినపుడు అది నేలలో బాగాకలిసే టట్లు జాగ్రత్త పడాలి
          కొద్దిగా ఆమ్లత్వం ఏర్పడ వచ్చు
          ఈ ఎరువును నీటిలో కరిగించి మొక్కలపై పిచికారి చేసిన నత్రజని శీఘ్ర గతిన మొక్కలు తీసుకొంటాయి (2 శాతం అనగా 20 గ్రా / లీ)
          నీటిలో కలిపి పిచికారీ చేసినప్పుడు అధిక గాడత కలిగియున్న ఆకులు మాదిపోతాయి. మరియు యూరియాలో బై యూరేట్అనే పైరు కు హాని చేసే పదార్ధముంటుంది. ఇది 1.5 % మించ కుండా వున్నపుడే యూరియా స్ప్రే పనికి వస్తుంది.

భాస్వర ఎరువులు (PHOSPHATIC FERTILIZERS)

భాస్వర ఎరువులు
                                                     (PHOSPHATIC FERTILIZERS)
భాస్వరము లభ్యమయ్యే రూపాన్ని బట్టి మరియు కరిగే స్వభావాన్ని బట్టి భాస్వర ఎరువులను వర్గీకరించారు.
a)      నీటిలో కరిగే భాస్వరపు ఎరువులు
b)      సిట్రిక్ ఆమ్లములో కరిగే భాస్వరపు ఎరువులు
c)      కరగని భాస్వరపు ఎరువులు
a)నీటిలో కరిగే భాస్వరపు ఎరువులు:
          ఈ ఎరువులు నీటిలో కరిగి వెంటనే భాస్వరాన్ని మొక్కకు అందజేస్తాయి.
          ఈ ఎరువులలో భాస్వరం H2PO4 రూపం లో వుంటుంది.
          ఈ ఎరువులు అన్ని నేలల్లోనూ తటస్థ  మరియు క్షార స్వభావము కలిగిన నేలల్లో వాడవచ్చు
ఉదా: సింగిల్ సూపర్ ఫాస్పేట్ (16% P2O5)
         డబుల్ సూపర్  ఫాస్ఫేట్ ( 32 % P2O5)
         ట్రిపుల్ సూపర్ ఫాస్పేట్ ( 48 % P2O5)
సింగిల్ సూపర్ ఫాస్పేట్ భాస్వరం (16 %) తో బాటు కాల్షియం (21 %), గంధకం (12 %) వుంటాయి. కొన్ని సూక్ష్మ పోషక పదార్దాలు కూడా ఈ ఎరువులో వుంటాయి. అందువల్ల ముఖ్యం గా వేరు శనగ పంటకు ఇది వేస్తారు.
ఎప్పుడూ విత్తనం నాటేటప్పుడు భాస్వర ఎరువులు వేసుకోవాలి. ఆరు తడి పంటలను వేసే టప్పుడు మొక్కలను 2 -3 సెం.మీ దూరం లో 4 -8  సెం. మీ లోతున వేసుకొంటే మంచి ఫలితమిస్తుంది.

b)సిట్రిక్ ఆమ్లములో కరిగే భాస్వరపు ఎరువులు :
ఈ ఎరువులో భాస్వరము HPO4   రూపంలో  ఉంటుంది.
ఉదా: బేసిక్ స్లాగ్ ( 16 % P2O5)
      బోన్ మీల్ (20 -25% P2O5)       (బేసిక్ స్లాగ్ ను పొడి చేసి ఆమ్ల భూములకు చల్లితే ఆమ్లత్వం తగ్గుతుంది.)


C)కరగని భాస్వరపు ఎరువులు:
          ఈ ఎరువులలో భాస్వరం PO4---  రూపం లో ఉంటుంది.
          అత్యధిక ఆమ్లత్వం కలిగిన నేలల్లో ఈ ఎరువులు కరిగి భాస్వరాన్ని మొక్కలకు అందిస్తాయి.
          అధిక వర్షాలు పడే పర్వత శ్రేణుల్లో పండించే టీ, కాఫీ తోటల్లో ఈ ఎరువు వేస్తారు.
ఉదా : శిలా ఫాస్పేట్ (rock phospate) ( 20 -40% P2O5)

పొటాష్ ఎరువులు(POTASSIC FERTILIZERS)

పొటాష్ ఎరువులు(POTASSIC FERTILIZERS)
  • పొటాష్ ఎరువులు పొటాష్ ను K+ రూపం లో మొక్కలకు అంద జేస్తాయి.
  • ముఖ్యమైన పొటాష్ ఎరువులు  మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (పొటాషియం క్లోరైడ్)      60 %K
సల్ఫేట్ ఆఫ్ పొటాష్ (పొటాషియం సల్ఫేట్)   50% K,18%S
పొటాషియం నైట్రేట్                                   39% K, 14 % N
  • మ్యూరేట్ ఆఫ్ పొటాష్ నీటిలో త్వరగా కరుగుతుంది
  • ఇతర పొటాష్ ఎరువులతో పోలిస్తే ధర తక్కువ
  • బంగాళాదుంప, పొగాకు వంటి పైర్లకు వేయరాదు
  • పొటాషియం సల్ఫేట్ ధర ఎక్కువ
  • పొటాషియం సల్ఫేట్ ఎక్కువగా బంగాళాదుంప, పొగాకు పైర్ల కు వాడుతారు
  • వర్షాభావ పరిస్థితుల్లో దీనిని పైర్ల పై పిచికారీ చేయవచ్చు.
  • పొటాషియం నైట్రేట్ ను నత్రజని, పొటాష్ లోపాలను సవరించడానికి పిచికారీ చేసుకోవచ్చు.

ద్వితీయ పోషక ఎరువులు (Secondary Nutrient Fertilizers)

ద్వితీయ పోషక ఎరువులు
(Secondary Nutrient Fertilizers)
  • ఆధునిక వ్యవసాయం లో అధిక దిగుబడి వంగడాల సాగు, సేంద్రియ ఎరువుల వాడకం తగ్గిపోవడం, రసాయన ఎరువులు ముఖ్యం గా సంకీర్ణ (complex) ఎరువుల వాడకం వల్ల అన్ని ప్రాంతాల్లో అనేక పైర్లు ఈ ద్వితీయ పోషకాల (కాల్షియం, మెగ్నీషియం, గంధకం) లోపాలకు దారి తీసింది.
  • ముఖ్యం గా ఆమ్ల భూముల్లో కాల్షియం, మెగ్నీషియం కలిగిన రసాయన ఎరువులు ప్రతి సంవత్సరం వేసుకోవాల్సి ఉంటుంది. గంధకం ప్రత్యేకంగా వేయనవసరం లేదు. దీనికి కారణం వ్యవసాయం లో వాడే వివిధ రసాయనిక ఎరువులు ముఖ్యం గా సూక్ష్మ పోషక లోప నివారణకు వాడే రసాయనాలు, చీడ పీడ లకు వాడే రసాయనాల్లో ఎంతో కొంత గంధకం కలిగి ఉంటుంది.

రసాయనిక పదార్ధం                            Ca%                 Mg%                S%
ముడి సున్నం (lime)                               36                    -                       -
డోలోమైట్ (Dolomite lime)                     17                    12                    -
బేసిక్ స్లాగ్ (Basic slag)                          29                    29                    -
జిప్సం(gypsum)                                     22                    -                       18
కాల్షియం నైట్రేట్                                       20                    -                       -
సింగిల్ సూపర్ ఫాస్పేట్                             20                    -                       12
ట్రిపుల్ సూపర్ ఫాస్పేట్                             13                    -                       -
రాక్ ఫాస్పేట్ (శిలా ఫాస్పేట్ )                     33                    -                       -
అమ్మోనియం సల్ఫేట్                               -                       -                       23
పొటాషియం సల్ఫేట్                                 -                       -                       18
మెగ్నీషియం సల్ఫేట్                                                        10.5                 13
పైరైట్                                                     -                       -                       55

సూక్ష్మ పోషక రసాయనిక ఎరువులు :

సూక్ష్మ పోషక రసాయనిక ఎరువులు :

సూక్ష్మ పోషక లోపాలు ఏర్పడడానికి ముఖ్య కారణాలు:
  1. అధిక దిగుబడి నిచ్చు వంగడాల సేద్యం
  2. సంవత్సర కాలం లో 2-3  పంటలు వేయడం (cropping intensity)
  3. విచక్షణా రహితం గా రసాయనిక ఎరువుల వాడకం
  4. సేంద్రియ ఎరువులు పూర్తిగా వేయక పోవడం
సూక్ష్మ పోషక లోపాల నివారణ:
  1. సేంద్రియ పదార్ధాలు విరివి గా వాడడం
  2. రసాయనిక ఎరువులు వాడకం లో సమతుల్యత
  3. ప్రత్యేకం గా సూక్ష్మ పోషకాలున్న రసాయన పదార్దాలు లేదా రసాయనిక ఎరువులు నేలలో వేయడం
  4. లోప లక్షణాలు కనిపించినపుడు ఆయా పోషక పదార్ధాలు ద్రావకం గా తయారు చేసి పిచికారీ చేయడం

సూక్ష్మ పోషక ఎరువులు రెండు రకాలు:
  1. సూక్ష్మ పోషకాలు కలిగి ఉన్న ఖనిజ లవణాలు
  2. చిలేటేడ్ రూపం లో యున్న సూక్ష్మ పోషకాలు, సేంద్రియ పదార్ధం చే రింగు ఆకారం లో బంధింపబడి వుంటాయి.
సూక్ష్మ పోషకాల లోపాలు సవరణ
జింకు లోప నివారణ:
ü  ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్ ప్రతి మూడు పంటలకు ఒకసారి వేసి లోపాన్ని నివారించ వచ్చును. అదే వరి తర్వాత వరి పంట ను వరుసగా వేసినట్లయితే ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్ ను ప్రతి రబీ పంటకు ముందు  వేసి నివారించ వచ్చు

ఇనుప ధాతు లోప నివారణ:
ü  లీటరు నీటికి 20 గ్రాముల అన్న భేది (Ferrous sulphate), 2 గ్రాముల నిమ్మ ఉప్పు కలిపి పిచికారి చేయాలి. పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నపుడు తక్కువ గాడత కల్గిన ద్రావణాన్ని (0.5 -1.0) వాడాలి.
బోరాన్ లోప నివారణ:
ü  0.1  శాతం బోరిక్ ఆమ్లాన్ని (1 లీటరు నీటికి 1 గ్రాము) రెండు సార్లు 10-15 రోజుల వ్యవధి లో పిచికారి చేయాలి. ప్రత్యామ్నాయం గా ముందు జాగ్రత్త గా చెట్టు పాదు లో 50 గ్రాముల బోరాక్స్ వేయాలి.

మెగ్నీషియం లోప నివారణ:
ü  లీటరు నీటికి 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ పైరు వేసిన 45, 90 రోజుల తర్వాత పిచికారి చేయాలి.

మాలిబ్డినం లోప నివారణ:
ü  ఎకరానికి 400 గ్రాముల సోడియం మాలిబ్డేట్ ను మట్టి లో కలిపి వేయాలి.
వివిధ సూక్ష్మ పోషకాల ఎరువులు  పోషక పరిమాణము
ఇనుము :
  1. ఫెర్రస్ సల్ఫేట్ (Ferrous sulphate) FeSO4.7H20                          20%                                                    
  2. ఫెర్రస్ చీలేట్  (Ironchelate)    Fe  EDTA             5%                                                                                             
  3. ఫెర్రస్ చీలేట్        (Iron chelate)  Fe  EDDHA                           6%
మాంగనీసు:
  1. మాంగనీస్ సల్ఫేట్           (Manganous sulphate)          Mn SO4.4H20               24%                            
  2. మాంగనస్ సల్ఫేట్           (Manganous sulphate monohydrate) Mn SO4. H2O  32%                            
  3. మాంగనీస్  చీలేట్            (Manganese chelate)              Mn  EDTA                 13%    
తుత్తు నాగము (zinc)
  1. జింకు సల్ఫేట్ (zinc sulphate)                                         Zn SO4 . 7 H2O             21%
  2. జింకు సల్ఫేట్ మోనో హైడ్రేట్ (zinc sulphate mono hydrate  Zn SO4 .H2O              36%
  3. జింకు చీలేట్ (zinc chelate)                                             Zn EDTA                     14%
బోరాన్ (Boron)
  1. బోరాక్స్ (borox)/ సోడియం టెట్రా బోరేట్                  Na2 B4 O7. 10 H2O                  11%
  2. బోరాక్సు ఎన్ హైడ్రస్                                             Na2 B4 O7                                22%
  3. బోరిక్ ఆమ్లము (Boric acid)                                H3BO3                                                18%
మాలిబ్డినం(Molybdenum)
  1. సోడియం మాలిబ్డేట్ (sodium molybdate)             Na2 Mo7 O24 . 4 H20                40%
  2. అమ్మోనియం మాలిబ్డేట్ (AmmOnium molybdate)            (NH4) MO7 O24. 4 H20   54%
  3. కాల్షియం మాలిబ్డేట్ (Calcium molybdate       Ca Mo O4                                                   48%