సేంద్రియ ఎరువులు
స్థూల సేంద్రియ ఎరువులు గాఢ సేంద్రియ ఎరువులు
BULKY ORGANIC MANURES CONCENTRATED ORGANIC MANURES
ఉదా: పశువుల ఎరువు, గొర్రె, మేక ఎరువు, మొక్కల సంబంధమైనవి జంతు సంబంధమైనవి
కంపోస్టు, కోళ్ళ ఎరువు, పంది ఎరువు, తినదగినవి రక్తాహారము(బ్లడ్ meal),
బయోగాస్ ఎరువు, వర్మి కంపోస్టు, కొబ్బరి పిండి, నువ్వుల ఎముకల పొడి (bone meal)
పచ్చి రొట్ట ఎరువులు పిండి, వేరుశనగ పిండి కొమ్ముల పొడి (horn meal)
తినదగనివి చేపల పొడి (fish meal)
ఆముదపు పిండి,ఆవపిండి,
కానుగ పిండి, కుసుమ పిండి, పత్తి గింజల పిండి
I. సేంద్రియ ఎరువులు:
· ప్రకృతి పరమైనవి.
· వ్యవసాయ, గృహ వ్యర్ధాల మూల పదార్ధాలు
· ప్రతి రైతు తక్కువ ఖర్చు తో తయారు చేసుకోవచ్చు.
స్థూల సేంద్రియ ఎరువులు:
- ఎక్కువ పరిమాణాలలో వాడవలసిన ఎరువులు
- పోషక విలువలు తక్కువ
- అన్ని పోషక పదార్ధాలు తక్కువ పరిమాణాలలో అందజేస్తాయి.
- నేల భౌతిక గుణాలు (నేల ఆకృతి) అనగా నీరు ఇంకే స్వభావం , నీరు నిల్వ చేయు గుణం, మురుగు నీరు పారుదల, నేల ఉష్ణోగ్రత, గాలి ప్రసరణ మెరుగు పడతాయి.
- స్థూల సాంద్రత తగ్గుతుంది. (స్థూల, సూక్ష్మ రంధ్రాల మొత్తం పరిమాణం పెరగడం వల్ల)
- నేల కోతకు గురికాకుండా చేస్తుంది.
- మినరలైజేషన్ వల్ల – పోషకాల నిలవరింపు (adsorption), పోషకాల సద్వినియోగం (use efficiency) మరియు సరఫరా (release), ధన అయాన్ మార్పిడి సామర్ద్యం (CEC) అధికమవుతాయి.
- నేలలో వచ్చే రసాయనిక మార్పులను తట్టుకొనే సామర్ద్యం (buffering capacity) పెరుగుతుంది.
- అనేక జీవ రసాయనిక చర్యలకు మూలమయిన సూక్ష్మ జీవుల మనుగడకు స్థూల సేంద్రియ ఎరువులు అవసరం.
పశువుల ఎరువు (Farm Yard Manure- FYM)
- ఇంటి దగ్గర గాని, పశువుల కొట్టాల వద్ద గాని, సాధ్యమైనంత వరకు చెట్ల నీడ గల ప్రాంతాన్ని పశువుల ఎరువు నిల్వ చేయుటకు ఎన్నుకోవాలి.
- పశువుల మల మూత్రాదులు, పశువులు తినగా మిగిలిపోయిన గడ్డి, వ్యవసాయం నుండి వచ్చే వ్యర్ద పదార్ధాలు, చెత్త చెదారాలు, ఆహార పదార్ధాలలో మిగిలిన వ్యర్ధాలు రోజూ కుప్పగా వేస్తారు.
- ఈ కుప్పగా వేసిన పదార్దాలు సూక్ష్మ జీవుల వలన చివికి – క్రుళ్ళి తొలకరి (జూన్ –జూలై) సమయానికి ఎరువుగా తయారవుతుంది.
- ఈ ఎరువును హెక్టేరు కు 10 టన్నులు పైగా వేసుకోవచ్చు.
పశువుల ఎరువు నాణ్యత:
- పెరిగే / పాలిచ్చే పశువుల మల మూత్రాదులలో పోషక పదార్దాలు వట్టిపోయిన లేదా వయస్సు ముదిరిన పశువుల కంటే తక్కువ గా వుంటాయి.
- వరి గడ్డి, జొన్న, మొక్కజొన్న మొదలైన గడ్డి తినే పశువుల కంటే పప్పు జాతి పశు గ్రాసాలు (పిల్లి పెసర, జనుము) మరియు నూనె గింజల నుండి తయారయ్యే చెక్క / పిండి తోనే పశువుల వ్యర్ధాలు అధిక పోషకాలు కలిగి ఉంటాయి.
- పశువుల పేడ, మూత్రం నేలలో ఇంకకుండా పెంట పోగుకు చేర్చిన ఎరువు పోషక విలువ పెరుగుతుంది.
- గోబర్ గ్యాస్ తయారీకి వాడిన – ఎరువు పోషక విలువలు పెరగడమే గాక, మన నిత్యావసరాలకు గ్యాసు వినియోగించు కోవచ్చు.
- ఎండకు ఎండి, వానకు తడిసిన ఎరువు కంటే పైన నీడను కల్పించి (sheds) ప్లాస్టరింగ్ చేసిన గోతులలో నిల్వ చేసిన ఎరువు ఎక్కువ పోషక విలువలు కలిగి వుంటుంది.
పశువుల ఎరువు – తయారు చేయు పద్ధతులు:
1) గుట్ట / కుప్ప పధ్ధతి :
- గ్రామ ప్రాంతాల్లో సాధారణం గా వాడే పధ్ధతి
- పశువులు తినగా మిగిలిన గడ్డి, పేడ, ప్రతి రోజూ తీసి కుప్పగా వేస్తారు.
- మూత్రాన్ని పీల్చే నిమిత్తం సాయంత్రం వేల పశువుల కాళ్ళ క్రింద చెత్త, గడ్డి అవసరమైనంత మేరకు పరచాలి. ఆ చెత్త మీద మూత్రము, పేడ పడతాయి.ఆ మరునాడు ఉదయం ఆ చెత్త ను సేకరించి గుట్టగా గాని, గుంత లో గాని వేయాలి.
- సాధ్యమైనంత వరకు చెట్ల నీడలో కుప్ప వేయాలి.
- కుప్ప చుట్టూ చిన్న గట్టు ఏర్పరచడం వలన సేంద్రియ పదార్ధం కొట్టుకొని పోకుండా చేయవచ్చు.
- గాలి ప్రసరణ వల్ల త్వరగా చివకడానికి వీలుంది.
నష్టాలు:
- నీడలో కుప్ప వేయక పోవడం వలన సూర్య రశ్మి వలన నత్రజని – అమ్మోనియా వాయు రూపంలో కలిసి పోతుంది. దీనికి జిప్సం (Ca SO4. 2 H20) లేదా సింగిల్ సూపర్ ఫాస్పేట్ అప్పుడప్పుడూ పెంటకుప్ప పై చల్లిన నత్రజని వృధా కాదు. మరియు భాస్వరపు విలువ పెరుగుతుంది.
- ఎక్కువ వర్షాల వల్ల పోషకాలు భూమి అడుగు పొరల లోనికి పోతాయి.
- అశాస్త్రీయ పధ్ధతి కాబట్టి పోషక పదార్ధాలు చాలా తక్కువ గా వుంటాయి.
2) గుంత పధ్ధతి (pit method):
- గుంత పొడవు ఇరవై అడుగులు, వెడల్పు ఆరు అడుగులు వీలును బట్టి పెట్టుకోవచ్చు.
- లోతు మూడు అడుగులు వుంటే తేలికగా చివికిన పెంట ను పైకి తీయవచ్చు.
- పశు విసర్జనలు గుంత లో ఒక కొన నుండి వేసుకొంటూ రావాలి.మూడవ వంతు భాగం నిండిన తర్వాత ఆరు అంగుళాల మంచి మట్టిని వేసి మరల దానిపై పశు విసర్జనలు వేస్తూ భూ మట్టానికి అర మీటరు ఎత్తు వరకు మట్టి తో వేసి అర్ధ చంద్రాకారపు కప్పు వేయాలి. చిక్కని పేడ నీటి తో ఎరువును మూసి పైన అలకాలి.
- పైన చెప్పబడిన కొలతలతో రెండు గుంతలు తవ్వితే సంవత్సరం పొడవునా రెండు జతల పశువుల నుంచి వచ్చే ఎరువు నింపడానికి సరిపోతుంది. ఒక్కొక్క పశువు నుండి ఏడాదికి 5 నుండి 6 టన్నుల నాణ్యమైన పేడ ఎరువు తయారవుతుంది.
- ఒక టన్ను పశువుల పేడ ఎరువుకు 25 కిలోల చొప్పున సూపర్ ఫాస్పేట్ కలిపి నత్రజని నష్టాన్ని ఆపవచ్చు. అప్పుడు అది మంచి సమతూకం గల ఎరువు అవుతుంది.
- దీనిలో సూర్య రశ్మి, వర్షాల వల్ల పోషకాల నష్టం ఉంటుంది. కాని గుట్ట / కుప్ప పధ్ధతి లో వున్నంత నష్టం వుండదు.
3) మూత వేయు గుంత పధ్ధతి (covered pit method)
- గుంత అడుగు, ప్రక్క భాగాలు ఒకటిన్నర అడుగుల ఎత్తు వరకు శాశ్వతం గా గోడ కట్టి గుంతను తయారు చేస్తారు.
- ప్రతి రోజూ వచ్చే వ్యర్ధ పదార్ధాలు గుంత లో వేస్తుంటారు. కొంత ఎత్తు వచ్చిన తర్వాత , మంచి మట్టిని ఆరు అంగుళాల పొరను దానిపై వేసి మరల వ్యర్ధ పదార్దాలు వేస్తారు.
- దీనిలో సింగిల్ సూపర్ ఫాస్పేట్ ఒకటి నుండి రెండు సార్లు వేసిన మంచి ఎరువు గా తయారు అవుతుంది.
No comments:
Post a Comment