మిశ్రమ ఎరువుల తయారీకి మూల పదార్ధాల పరిమాణము లెక్కగట్టుట :
(calculation for preparation of mixed fertilizers)
ఉదా: ఒక టన్ను మిశ్రమ ఎరువు 10-6-4 (N-P-K) పోషక నమూనా (fertilizer grade) తో తయారు చేయుటకు కావలసిన అమ్మోనియం సల్ఫేట్, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరియు ఇతర ఫిల్లర్ పదార్ధం ఎంత?
- కావలసిన మిశ్రమ పరిమాణం : 1 టన్ను = 1000 కిలోలు
- అమ్మోనియం సల్ఫేట్ లో నత్రజని శాతం : 20.5
- సూపర్ ఫాస్పేట్ లో భాస్వర శాతం : 16.0
- మ్యూరేట్ ఆఫ్ పొటాష్ లో పొటాష్ శాతం : 60.0
- Fertilizer grade : 10-6-4 (N-P-K)
కావలసిన పోషక శాతము
టన్ను మిశ్రమ ఎరువుకు కావలసిన ఎరువు = ------------------------------------------------ x 1000
వాడే ఎరువు లో ఉన్న పోషక శాతము
అమ్మోనియం సల్ఫేట్ = 10 /20.5 x 1000 = 487.8 Kg
సూపర్ ఫాస్పేట్ = 6 / 16 x 1000 = 375 Kg
మ్యూరేట్ ఆఫ్ పొటాష్ = 4 / 60 x 1000 = 66.7 Kg
మొత్తం రసాయనిక ఎరువుల పరిమాణం =487.8 + 375 + 66.7 = 929.5 Kg
కావలసిన మిశ్రమ ఎరువు పరిమాణం = 1000 Kg
కలపవలసిన ఫిల్లర్ పదార్ధం = 1000 – 929.5 = 70.5 Kg
ఉదా:2
ఒక టన్ను మిశ్రమ ఎరువు 6-4-3 (N-P-K) పోషక నమూనా (fertilizer grade) తో తయారు చేయుటకు కావలసిన వివిధ రకాల ఎరువుల పరిమాణం ఎంత?
ఈ మిశ్రమ ఎరువులో నత్రజని నిమిత్తం 1:2 నిష్పత్తి లో వేపపిండి, యూరియా వాడవలసి వుంది.
భాస్వరం నిమిత్తం బేసిక్ స్లాగ్ మరియు సింగిల్ సూపర్ ఫాస్పేట్ 1:3 నిష్పత్తి లో వాడవలసి ఉంది
పొటాష్ ఎరువు గా సల్ఫేట్ ఆఫ్ పొటాష్ వాడవలెను.
పోషక నమూనా = 6-4-3 (N-P-K)
నత్రజని:
పోషక నమూనా లో నత్రజని శాతం = 6
వేపపిండి రూపం లో సరఫరా చేయవలసిన నత్రజని శాతం = 6 x 1 / 3 = 2
యూరియా రూపం లో సరఫరా చేయవలసిన నత్రజని శాతం = 4
వేపపిండి పరిమాణం = 2 / 5 x 1000 = 400 Kg
(వేపపిండి లో నత్రజని శాతం = 5 )
యూరియా పరిమాణం = 4 / 46 x 1000 = 87 Kg
భాస్వరం:
పోషక నమూనాలో భాస్వర శాతం = 4
క్షార స్లాగ్ రూపం లో సరఫరా చేయవలసిన భాస్వర శాతం = 1
సింగిల్ సూపర్ ఫాస్పేట్ రూపం లో సరఫరా చేయవలసిన భాస్వర శాతం = 3
క్షార స్లాగ్ పరిమాణం = 1 / 18 x 1000 =55.5 Kg (క్షార స్లాగ్ లో భాస్వర శాతం =18)
సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ పరిమాణం = 3 /16 x 1000 = 187.5 Kg
పొటాష్:
పోషక నమూనా లో పొటాష్ శాతం = 3
సల్ఫేట్ ఆఫ్ పొటాష్ పరిమాణం = 3 / 50 x 1000 = 60 Kg
(SOP లో K శాతం 50 )
మొత్తం ఎరువుల పరిమాణం:
వేపపిండి = 400 Kg
యూరియా = 87 Kg
క్షార స్లాగ్ = 55.5 Kg
సింగిల్ సూపర్ ఫాస్పేట్ = 187.5 Kg
సల్ఫేట్ ఆఫ్ పొటాష్ = 60 Kg
మొత్తం ఎరువుల పరిమాణం = 790 Kg
కలపవలసిన ఫిల్లర్ = 1000 – 790 = 210 Kg
No comments:
Post a Comment