Wednesday, 25 May 2016

కంపోస్టు

వ్యవసాయ, గృహ, పట్టణ సేంద్రియ వ్యర్ధాలు ఒక పధ్ధతి లో  కృళ్ళేటట్లు చేసి వాటి పరిమాణం తగ్గించి విలువైన ఎరువు గా తయారు చేయడాన్ని  కంపోస్టింగు  అంటారు

కంపోస్టు ఎందుకు చేయాలి  దాని వల్ల లాభాలు:
·         వ్యవసాయ, గృహ, పట్టణ వ్యర్ధాలను ఉపయోగించి వ్యవసాయానికి పనికి వచ్చే ఎరువు గా వాడుకోవచ్చు.
·         ప్రత్యేక శ్రద్ద, నైపుణ్యం అవసరం లేదు.
·         పెద్ద పట్టణాలు , నగరాలలో పేరుకు పోతున్న చెత్తను సద్వినియోగ పరచ వచ్చు
·         వ్యర్ధ పదార్ధాలు పేరుకు పోకుండా చేయడం వల్ల సూక్ష్మ జీవుల వల్ల వచ్చే జబ్బుల నుండి నివారణ
·         వ్యర్ధ పదార్ధాలలో C : N నిష్పత్తి తగ్గించి అతి విలువైన సేంద్రియ పదార్ధాన్ని తయారుచేసి వ్యవసాయాభివృద్ధి కి వినియోగించవచ్చు
·         కలుపు విత్తనాలు క్రుళ్ళడం వల్ల మొలకెత్తవు
·         వ్యర్ధాలు ఆక్రమించే స్థలాన్ని తగ్గించ వచ్చు.
కంపోస్టు ప్రక్రియను నియంత్రించే అంశాలు (Factors affecting compost process)
  • సేంద్రియ వ్యర్ధాల భౌతిక, రసాయనిక స్థితులు
  • కంపోస్టు దిబ్బలో గాలి ప్రసారం (aeration)
  • కంపోస్టు దిబ్బలో తేమ శాతం
  • ఉష్ణోగ్రత
  • పి హెచ్ (PH)
  • సమయము
  • క్రుళ్ళడానికి ఉపయోగపడే సూక్ష్మ జీవుల లభ్యత

బాక్టీరియా:
బాసిల్లస్ బ్రూయిస్ (Bacillus brewis)
బాసిల్లస్ సర్కులాన్స్ (Bacillus circulans)
బాసిల్లస్ కోయాగులాన్స్ (Bacillus coagulans)
బాసిల్లస్ సబ్టిలిస్ (Bacillus subtilis)

ఆక్టినో మైసిట్స్:
నొకార్డియా          (Nocardia)
థర్మోఎక్టినో మైసిటీస్ వుల్గారిస్ (Thermo actino mycetes vulgaris)
స్ట్రెపో  మైసిటిస్    (Streptomycetes rectus)
థర్మనోస్పోరా       (Thermonospora)

శిలీంద్ర జాతి :
మ్యుకార్                        (Mucar)
కీటో మియం       (chetomium)
థర్మోఫైలం           (Thermo phylum)
పెన్సీలియం         (Pencillium)
ఎస్పర్జిల్లస్           (Aspergillus)

  • కంపోస్టు దిబ్బలో తగినంత తేమ ఉండేటట్లు  చేయాలి
  • ఆల్కహాల్ తయారీలో వ్యర్ధం గా మిగిలిన ఈస్ట్ స్లడ్జ్(yeast sludge) ని కుళ్లడానికి ఉపయోగించ వచ్చు.


కంపోష్టు రకాలు

  1. గ్రామీణ కంపోష్టు
  2. పట్టణ కంపోష్టు

గ్రామీణ కంపోష్టు:
  • సుమారు ఆరు అడుగుల లోతు, పన్నెండు అడుగుల వెడల్పు మరియు యాభై అడుగుల పొడవు గల గుంటలో వివిధ గ్రామీణ ప్రాంత వ్యర్ధ పదార్ధాలను ఒక అడుగు మందం లో పరచు కోవాలి.
  • గ్రామీణ ప్రాంత వ్యర్ధాలు: గృహాల్లో ఆహార వ్యర్ధాలు, వ్యవసాయ వ్యర్ధాలు, పశువుల శాల లో పేడ , మూత్రము, మూత్రము తో నానిన గడ్డి మొదలైనవి.
  • వ్యవసాయ వ్యర్ధాలు: కలుపు మొక్కలు, పైరు మోళ్ళు( crop stubbles) , పొట్టు లేదా ఊక (bhusa, straw, shells etc), పైర్ల వ్యర్దాలైన చెరకు ఆకు, ప్రత్తి కంప, వేరు శనగ పొట్టు, ఇతర వ్యర్ధాలు, పశువుల మూత్రం తో నానిన మట్టి, పశువుల విసర్జనలు వాడుతారు.
  • వ్యర్దాలను పేడ నీటితో బాగా తడుపుతారు.
  • ఈ విధం గా నేల మీద 5 అడుగులు వచ్చే వరకు క్రమ పద్ధతులలో వ్యర్ధాలను పేర్చుకొంటూ వచ్చి ఆ తరువాత గుంత ను మట్టి తో కప్పుతారు.
  • మూడు నెలల తర్వాత క్రుళ్ళిన వ్యర్ధాలను బయటకు తీసి గుట్ట గా పోసి అవసరం మేరకు నీటితో తడిపి మళ్ళీ మట్టి తో కప్పుతారు.
  • మూడు నెలల తర్వాత క్రుళ్ళిన ఈ వ్యర్ధాలను బయటకు తీసి ఎరువు గా వాడుతారు.
  • పశువుల పేడ ఎక్కువగా వేసిన కృళ్ళే ప్రక్రియ వేగవంతమగును .


పట్టణ కంపోష్టు:
  • పట్టణ ప్రాంత వ్యర్ధాలను వాడి కృళ్ళేటట్లు చేయగా తయారయిన ఎరువును పట్టణ కంపోష్టు అంటారు.
  • పట్టణ ప్రాంత నివాసాలకు దూరం గా (కనీసం ఒకటిన్నర కి. మీ) పల్లపు ప్రాంతాలలో గాని లేదా వ్యర్ధాల లభ్యతను బట్టి అనువైన ప్రాంతం లో అనువైన కొలతలతో గుంత త్రవ్వుకొని పట్టణ వ్యర్ధాలను క్రమ బద్ధం గా పేర్చు కోవాలి.
  • గృహాలలోని వ్యర్ధాలు, వీధులలోని చెత్త, చేదారము, వివిధ పరిశ్రమల వ్యర్ధాలు, ఇతర వ్యర్ధాలు నిత్యమూ పట్టణ పారిశుధ్య విభాగము(sanitary dept) ప్రోగు చేసి పట్టణ సరిహద్దులకు తరలించెదరు .వీటిని క్రమ బద్దం గా గుంత లో విస్తరింప చేయుదురు.
  • ఒక అడుగు మందములో వ్యర్ధాలను పేర్చిన తరువాత దాని మీద క్రుళ్ళడానికి మానవ విసర్జనలు (గ్రామీణ కంపోష్టు లో వాడే పశువుల పేడ కు బదులుగా) వాడుదురు.
  • ఈ విధం గా పొరలు పొరలు గా పట్టణ వ్యర్ధాలు, మానవ విసర్జనలు పరచుకొంటూ నేల మీదకు కొంత ఎత్తు వరకు గుట్ట గా చేయాలి.
  • ఈ గుట్టలు కప్పకుండా వదిలి వేసిన ఆక్సిజన్ సమక్షం లో (aerobic decompositon)క్రుళ్ళు తాయి. గుట్టలు కప్పి వేసినపుడు ఆక్సిజన్ లేకుండా (anaerobic decomposition) కృళ్ళే కార్యక్రమం జరుగుతుంది.
  • పట్టణ కంపోష్టు నుండి వెలువడే దుర్గంధాన్ని (foul smell) నివారించుటకు మరియు ఈగల (flies) బెడద నివారణ కు కాపర్ సల్ఫేట్ జల్ల వలెను.
  • పట్టణ కంపోష్టు తయారీ కి అనేక పద్ధతులు ఉన్నాయి.
Ø  ADCO  పధ్ధతి
Ø  బెంగళూరు పధ్ధతి
Ø  ఇండోర్ పధ్ధతి
Ø  కోయంబత్తూర్ పధ్ధతి
  • పధ్ధతి ని బట్టి వాడే ముడి పదార్ధాలు మారును. ఉపయోగించే సేంద్రియ పదార్ధాలు ఒకే రకమయినప్పటికి క్రుళ్ళ డానికి వాడే ముడి పదార్దములు మారును. ఈ ముడి పదార్ధాలు కృళ్ళే ప్రక్రియను వేగవంతం చేస్తాయి.
  • ఉదా: అమ్మోనియం సల్ఫేట్, సున్నము, బొగ్గుపొడి, యూరియా, ఎముకల పొడి, నూనె పిండి
  • ఎరువు దిబ్బలో తేమ ఉండేటట్లు చూచు కోవడం చాలా అవసరం
  • ఎరువు 3-4 నెలల్లో తయారవుతుంది.

No comments:

Post a Comment