ద్వితీయ పోషక ఎరువులు
(Secondary Nutrient Fertilizers)
- ఆధునిక వ్యవసాయం లో అధిక దిగుబడి వంగడాల సాగు, సేంద్రియ ఎరువుల వాడకం తగ్గిపోవడం, రసాయన ఎరువులు ముఖ్యం గా సంకీర్ణ (complex) ఎరువుల వాడకం వల్ల అన్ని ప్రాంతాల్లో అనేక పైర్లు ఈ ద్వితీయ పోషకాల (కాల్షియం, మెగ్నీషియం, గంధకం) లోపాలకు దారి తీసింది.
- ముఖ్యం గా ఆమ్ల భూముల్లో కాల్షియం, మెగ్నీషియం కలిగిన రసాయన ఎరువులు ప్రతి సంవత్సరం వేసుకోవాల్సి ఉంటుంది. గంధకం ప్రత్యేకంగా వేయనవసరం లేదు. దీనికి కారణం వ్యవసాయం లో వాడే వివిధ రసాయనిక ఎరువులు ముఖ్యం గా సూక్ష్మ పోషక లోప నివారణకు వాడే రసాయనాలు, చీడ పీడ లకు వాడే రసాయనాల్లో ఎంతో కొంత గంధకం కలిగి ఉంటుంది.
రసాయనిక పదార్ధం Ca% Mg% S%
ముడి సున్నం (lime) 36 - -
డోలోమైట్ (Dolomite lime) 17 12 -
బేసిక్ స్లాగ్ (Basic slag) 29 29 -
జిప్సం(gypsum) 22 - 18
కాల్షియం నైట్రేట్ 20 - -
సింగిల్ సూపర్ ఫాస్పేట్ 20 - 12
ట్రిపుల్ సూపర్ ఫాస్పేట్ 13 - -
రాక్ ఫాస్పేట్ (శిలా ఫాస్పేట్ ) 33 - -
అమ్మోనియం సల్ఫేట్ - - 23
పొటాషియం సల్ఫేట్ - - 18
మెగ్నీషియం సల్ఫేట్ 10.5 13
పైరైట్ - - 55
No comments:
Post a Comment