ఉసిరి-
ఆరోగ్యపు సిరి
ఉసిరి ఒక చెట్టు.
ఉసిరికాయల కోసం పెంచుతారు. ఉసిరి కాయను ఆంగ్లంలో ద ఇండియన్ గూస్ బెర్రీ అనీ, హిందీలో “ఆమ్ల”
అనీ, సంస్కృతంలో “ఆమలక” అనీ అంటారు. దీని శాస్త్రీయనామం ఫిలాంథస్ ఎంబ్లికా. ఉసిరి కాయలను, గింజలను, ఆకులను, పూలను, వేళ్ళను, బెరడును
ఆయుర్వేద ఔషధాలలో వాడతారు. ఉసిరిచెట్టు 8 నుండి 18 మీటర్ల
ఎత్తు పెరుగుతుంది. ఆకులు 7-10 సె.మీ. ఉంటాయి. పువ్వులు
ఆకుపచ్చ-పసుపు రంగులో ఉంటాయి. ఉసిరికాయలు గుండ్రంగా లేత ఆకుపచ్చ-పసుపు రంగులో
గట్టిగా ఉండి 6 నిలువుచారలు కలిగి ఉంటాయి. ఉసిరికాయలు
పుల్లగా పీచుతో ఉంటాయి. ఉసిరిలో అనేక పోషక విలువలతోబాటు ఔషధ గుణములున్నందున దీనిని
అమృత ఫలమంటారు.
ఔషధగుణములు:
ü ఉసిరి
కాయలలో విటమిన్ 'సీ' అధికముగా
వున్నది. దీన్ని తిన్నందు వల్ల శరీరానికి రోగ నిరోధక శక్తి పెరుగును.
ü శరీరానికి
చల్లదనాన్నిచ్చి మల మూత్ర విసర్జన సక్రమముగా జరుగును.
ü చక్కెర వ్యాధి
గ్రస్తులు దీనిని వాడినందున ఇన్సులిన్ ఉత్పత్తికి అనుకూలించి రక్తంలోని చెక్కెరను
తగ్గించును.
ü జ్ఞాపక
శక్తినిచ్చే మందులలో దీనిని ఎక్కువగా వాడుతారు.
ü కురుల
ఆరోగ్యానికి కూడు ఉసిరి కాయలను ఎక్కువగా ఉపయోగిస్తారు.
ü ఊపిరి
తిత్తులు ,కాలేయం , జీర్ణమండలం
, గుండె -దీని పరిదిలోనికి వస్తాయి .
జీర్ణమండలం :
ü పుల్లని
రుచి ఉండే ఉసిరిని తినటం వలన జీర్ణవ్యవస్థలోని రిసెప్టార్’లను ఉత్తేజ పరచి, జీర్ణక్రియ
ఎంజైమ్ ఉత్పత్తిని పెంచుతుంది. అధిక మొత్తంలో ఫైబర్’లను కలిగి ఉండటం వలన
జీర్ణక్రియ సమస్యలను సులభంగా తగ్గిస్తుంది. పేగు కదలికలను మెరుగుపరచటమే కాకుండా
జీర్ణక్రియ అవయవాలను శుభ్రపరుస్తుంది
ü దాహం ,మంట,వాంతులు ,ఆకలిలేకపోవుట
,చిక్కిపోవుట ,ఎనీమియా ,హైపర్ -ఎసిడిటి, మున్నగు
జీర్ణ మండల వ్యాదులను తగ్గిస్తుంది .
ఊపిరితిత్తులు :
ü ఆస్తమా, బ్రాంకైటిస్, క్షయ, శ్వాసనాలముల
వాపు, ఉపిరితిత్తుల నుండి రక్తము పడుట మున్నగు
వ్యాదులను నయం చేస్తుంది .
గుండె :
ü ఎన్నో
రకాల గుండె జబ్బులను నయం చేస్తుంది . ఉసిరి వల్ల ఆహారములోని ఇనుము ఎక్కువగా
గ్రహించబడుటకు తోడ్పడుతుంది . శరీరము లో ఎక్కువగా ఉండే కొవ్వులను తగ్గిస్తుంది .
కాలేయము :
ü కామెర్లు
ఉసిరి లోని 'లినోయిక్ ఆసిడ్ 'వల్ల
తగ్గుతాయి . కాలేయం లో చేరిన మలినాలు , విషపదార్ధాలు
ను తొలగిస్తుంది ,యాంటి ఆక్షిడెంట్' గా
పనిచేస్తుంది .
కామెర్లు :
ü ఉసిరి
రసాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితె వైటమిన్ లోపంవల్ల కలిగే వ్యాధి మరియు
కామెర్లు రాకుండ సహయపదుతుంది.
మలబద్ధకం:
ü మలబద్ధకం
సమస్య ఉన్నవారు ప్రతి రోజు ఉసిరి కాయ తినడం వలన ఈ సమస్య తగ్గిపోతుంది
నోటి పూత:
ü నోటి
పూతతో బాధపడేవారికి ఉసిరి కాయ రసంతో చక్కటి పరిష్కారం దొరుకుతుంది. అర కప్పు
నీటిలో ఉసిరి కాయ రసాన్ని కలిపి పుక్కిలిస్తే మంచి ఫలితము ఉంటుంది.
కంటిచూపు:
ü ఉసిరి కంటిచూపు
మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది. అంతేకాకుండ కళ్ళు ఎర్రబడటం మరియు దురదని కూడా
తగ్గిస్తుంది. సగం కప్పు నీటిలో రెండు చెంచాల ఉసిరి రసాన్ని కలుపుకొని ప్రతి రోజు
ఉదయం తాగుతూ ఉంటే కళ్ళకు చాలా మంచిది.
ప్రయోజనాలు ఇంకా...
ü లైంగిక
సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఉసిరి ఎంతో మేలు చేస్తుంది.
ü కడుపులో
రసాయనాలను సమతుల్యం చేసి, శరీరాన్ని
చల్లబరుస్తుంది.
ü కాలేయ
సామర్థ్యాన్ని మెరుగుపరచడమేగాక, శరీరంలోని విష
తుల్యాలను తొలగిస్తుంది.
ü కొలస్ట్రాల్‌ను, రక్తంలో
చక్కెర నిల్వలను తగ్గిస్తుంది. హృద్రోగాలు, మధుమేహం
రాకుండా నివారిస్తుంది. మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. ఙ్ఞాపకశక్తినీ
పెంచుతుంది.
ü కఫ
దోషాలను ఊపిరితిత్తుల సమస్యలను నివారిస్తుంది. శ్లేష్మాన్ని తొలగిస్తుంది.
మలబద్దకం లేకుండా చేస్తుంది.
ü కంటి
చూపును మెరుగుపరుస్తుంది. అందుకే ఉసిరిని చక్షుక్షయ అని కూడా పిలుస్తారు.
ü ఉసిరిలో
విటమిన్-సీ శరీరాన్ని ఎండ వేడిమికి పాడవకుండా సంరక్షిస్తుంది. చర్మరోగాల నుంచి
కాపాడుతుంది. చర్మానికి ఛాయనిస్తుంది. మొటిమల్ని తగ్గిస్తుంది.
ü కేశపోషణలో
దీన్ని మించింది లేదు. ఉసిరి పొడి, షాంపులు, నూనెలు
చుండ్రుని నివారిస్తాయి.
ü ఉసిరిని
ఆహారంలో క్రమం తప్పక తీసుకుంటే కాల్షియం శోషణలో శరీరానికి సహాయ పడుతుంది. ఎముకలు, దంతాలు, గోళ్లు, కేశాలు
దృఢంగా పెరుగుతాయి.
ü ఇది
మెదడకు శక్తి వంతమైన ఆహారం లాగా పనిచేస్తుంది.
ü దీనిలో
అద్బుతమైన యాంటి ఆక్షిడేంట్ ఉండటం వల్ల వ్రుద్దాప్యం దరిచేరనీయాదు.
ü కణాల డీ
జనరేషన్ కరనమాయే స్తిరం లేని ఐకాన్ లతో పోరాడుతుంది.
ü ఆహారం
శరీరానికి పట్టడానికి ఉసిరి చాల సహకరిస్తుంది. ఇది తిన్న ఆహారంలోని ఐరన్ నీ
గ్రహించి ఆహారాన్ని శరీరానికి జీర్ణం చేయడానికి ఇది బాగా సహకరిస్తుంది.
ü ఉసిరి
తినడం వలన ప్రోటీన్ జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఇది వ్యాయామాలు చేసే వారికీ చాల
ఉపయోగకరం.
ü ఉసిరి
తీనటం వలన శరీరము లోని అదనపు కొవ్వును కరిగించుకోవచ్చు
ü ఎవరైతే
నోటి అల్సేర్స్ తో బాధపడుతున్నారో వారు కొంచెం ఉసిరి రసాన్ని నీటీతో కలిపి
పుకిలిస్తే అల్సుర్స్ తగ్గుతాయి.
ü రోజు
ఎవరైతే ఉసిరికాయ తింటారో వాళ్ళు 100 ఏళ్ళు ఆరోగ్యంగా
ఉంటారు అని శాస్త్ర వేత్తలు చెపుతున్నారు.
ü ఉసిరికాయ
అనేది చావంప్రాష్ మరియు త్రిఫల చూర్ణం లో ముక్యమైనది.
ü ఉసిరికాయ
తినటం వల్ల గొంతు సమస్యలు తగ్గించుకోవాచ్చు.
ü ఉసిరికాయ
మొటిమాలని తగ్గిస్తుంది.
ü ఉసిరిరసం
చుండ్రు ని తగ్గిస్తుంది.
ü ఉసిరిరసం
కోరింత దగ్గును తగ్గిస్తుంది.
ü ఉసిరి రసం
గుండెను బలంగా తయారుచేస్తుంది.
ü ఉసిరి రసం
వల్ల ఒంట్లోని వ్యాది నీరోదక శక్తీ పెరుగుతుంది.
ü ఉసిరిరసం
వల్ల జ్వరం తగ్గుతుంది.
ü ఎండిన
ఉసిరికాయలు తినటం వల్ల మంచిగా ఆహారం అరుగుతుంది.
ü ఉసిరికాయ
తినటం వల్ల సరిరం లోని రెడ్ బ్లడ్ సెల్ల్స్ పెరుగుతాయి.
ü ఉసిరికాయ
తినటం వల్ల ఎముకలు గట్టిగ ఉంటాయి.
ü ఉసిరి ని
ప్రతిరోజు తినటం వల్ల ఆడవాళ్ళలో ఉండే మెనూస్ట్రవల్ ప్రొబ్లెమ్స్ తగ్గుతాయి.
ü ఉసిరికాయ
మరియు జామకాయ తినటం వల్ల మదుమేహం నూ అదుపులో ఉంచుకోవాచ్చు.
ü ఎవరైతే
గ్యాస్ సమస్యతో బాద పడుతున్నారో వారు ఒక గ్రమ్ ఉసిరి పౌడర్ తీసుకొని దీనికి కొంచెం
పంచదార కలుపుకొని ఒక గ్లాస్ నీటిలో కలుపుకొని రోజుకు రొండు సార్లు తాగాలి.
ü ఉసిరి
వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.
ü ఉసిరి
వల్ల పిల్లలు అడ వారిలో మరియు మొగవరిలోపుట్టే వ్యవస్తను బాగు చేస్తుంది.
ü ఉసిరి
వల్ల స్పెర్మ్ కౌంట్ కూడా పెరుగుతుంది.
ü ఉసిరి
రోజు తినటం వల్ల ఉపిరితితులకు బాగా బలం వస్తుంది.
ü ఉసిరి లో
క్రోమియం అదికంగా ఉంటుంది దీని వలన మడుమేహాని అదుపులో ఉంచొచు.
ü ఉసిరి కాయ
తినటం వల్ల అస్తమ రోగులకు మంచి ఉపయోగకారిగా ఉంటుంది.
ü ఉసిరిరసం
మరియు తేనే కలిపి తీసుకుంటే రక్తాన్ని సుద్ది చేస్తుంది.
ü ఉసిరి తినటం
వల్ల రక్త హీనత నుంచి కూడా రక్షించుకోవచ్చు.
ü ఉసిర కాయల
గింజలను తీసుకొని నీమ్మరసంతో కలిపి రాసుకుంటే ఒక గంటలో పేలు చచ్చిపోతాయి.
ü ఉసిరికాయలను
తిన్నవారిలో కంటి చూపు సమస్యలు ఉండవు.
ü ఉసిరిక
పండు ముసలితనము యొక్క లక్షణములు రానీయకుండా శరీరమును దృడంగాను, పటుత్వముగాను, ఉంచి
యవ్వన వంతునిగా ఉంచుతుంది. విటమిన్ సి
ఎక్కువగా ఉంటుంది. రోజుకు ఒక ఉసిరికాయ తీనె వారికీ ఆరోగ్య రిత్య ఏంటో మేలు
చేస్తుంది.
ü ఉసిరిక
పండ్లతో చేసిన అత్యంత బలకరమైన, ప్రాచుర్యమైన మందు
చ్యవనప్రాశావ లేహ్యం.
ü మధుమేహ
రోగికి ఉసిరిక రసం లేదా ఎండబెట్టిన ఉసిరిక పండ్ల చూర్ణములో పసుపును కలిపి ఒక
గ్రాము చొప్పున తేనెతో కలిపి ఇచ్చిన మధుమేహము తగ్గును. ఈ రెండు కలిసిన మందు
‘నిశాఅమలకి’ టాబ్లెట్ గా మందుల షాపులలో లభ్యమగు చున్నది.
ü ఉసిరి వివిధ పాలీఫినాల్'లను కలిగి ఉండటం వలన, ఫ్రీరాడికల్'ల వలన కలిగే ఆక్సిడేషన్'ను నియంత్రించే శక్తిని కలిగి ఉంటుంది. ఫ్రీ రాడికల్'లు, శరీరంలో ఆక్సిడేషన్ చర్య జరిపి ప్రమాదానికి గురి చేస్తాయి. ఉసిరి, ఈ చర్యలను నిలిపివేసే
పాలీఫినాల్'లను
కలిగి ఉండి, ఈ
చర్యలను జరగాకుండా అడ్డుపడుతుంది.
ü ఎండిపోయిన
ఉసిరికాయను బెల్లంతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. రెండు
ఉసిరికాయలను నీటిలో నానబెట్టి ఆ నీటితో కళ్ళను శుభ్రం చేసుకోవచ్చు. ఇలా చేస్తే
కళ్లు ఎర్రబడటం, దృష్టి లోపాలు
వుండవు. అలాగే ఉసిరికాయ గింజలను ఎండబెట్టి పొడిచేసుకుని వాటిని కొబ్బరి నూనెలో
బాగా మరిగించి, తర్వాత ఆరనిచ్చి. మాడుకు పట్టిస్తే జుట్టు
మృదువుగా తయారవుతుంది.
ü ఉసిరికాయ
తీసుకోవడం ద్వారా అనారోగ్యాలను ముందుగానే నియంత్రించుకోవచ్చు. ఇకపోతే.. ఉసిరికాయలో
విటమిన్ సి, ఐరన్ ఉన్నాయి. ఆరెంజ్ పండు కంటే ఉసిరిలో 20 రెట్లు
విటమిన్ సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ü ఆమ్లా(ఉసిరి)జ్యూస్
మీ చర్మానికి అద్భుతంగా పనిచేసి, మిమ్మల్ని
యవ్వనంగా కనబడేలా చేస్తుంది. ఆమ్లా(ఉసిరి)జ్యూస్ లో పుష్కలమైన యాంటీఆక్సిడెంట్స్
ఉన్నాయి. అందువల్లే ఇది ప్రీమెచ్యుర్ ఏజింగ్, ముడుతలు, మరియు
ఫైన్ లైన్స్ ను నివారిస్తుంది .
ü ఆయుర్వేదము
నందు ఉసిరిక పండునకు అత్యధిక ప్రాముఖ్యతను ఇచ్చారు మన పెద్దలు. ఉసిరిక పండు
వయస్థాపన, రసాయనంగా చెప్పబడినది. అనగా ముసలితనం
లక్షణములు రానీయకుండా శరీరమును ధృడంగాను, పటుత్వముగాను, ఉంచి
యవ్వనవంతునిగా ఉంచుతుంది. ఉసిరిక కాయలను ప్రతిరోజూ సేవించడం వలన శరీరములో వ్యాధి
నిరోధక శక్తి పెరిగి ఏ వ్యాధులనూ దరిచేరనివ్వదు.
ü అమృతముతో
సమానమైన గుణములు కలిగి ఉండుట వలన దీనిని అమృత ఫలమందురు. నేత్రములకు మంచిది.
మధుమేహము, కుష్టం, మూలశంక, స్త్రీలలో
కలుగు ప్రదర రోగం (అధిక ఋతు స్రావం),రక్త
స్రావ రోగం మొదలగు వ్యాధులలో అత్యుత్తమముగా పనిచేయును. ప్రదర వ్యాధులందు
(స్త్రీలలో వచ్చు అధిక ఋతుస్రావం) ఉసిరికాయల చూర్ణమును చక్కెర లేదా తేనెతో లేదా
బియ్యం కడిగిన నీటితో ఇచ్చిన తగ్గును.
ü మూత్రం
ఆగిపోయిన యెడల ఉసిరిక చూర్ణమును బెల్లంతో కలిపి ఇచ్చిన మూత్రం మరల సాఫీగా జారీ
అగును.
ü ప్రతి
మనిషీ కనీసం ఐదు ఉసిరి చెట్లను పెంచాలనీ, ఆరోగ్యసిరి
ఉసిరిలోనే ఉందనీ, ఆయుర్వేదంలో ఉసిరి
పాత్ర కీలకమని పూర్వీకులు వెల్లడించారు. ఆపిల్ కంటే ఉసిరిలో ప్రొటీన్ల శాతం మూడు
రెట్లు ఎక్కువ అనీ, దానిమ్మతో
పోలిస్తే 27రెట్లకు పైగా విటమిన్-సి ఉంటుందనీ, యాంటీ
యాక్సిడెంట్ల శాతం ఎక్కువేనని ఇటీవలి పరిశోధనలూ స్పష్టం చేస్తున్నాయి. అంతేకాదు..
అక్టోబర్ నుంచి డిసెంబర్‌దాకా అటవీ పాంత్రాల్లో విరివిగా దొరికే ఉసిరి కాయలు
గిరిజనులకు ఉపాధినిస్తాయి.
ఉసిరిలో పోషకాలు:
ü సిలెంబ్లిన్, ఆస్కార్బిక్
ఆమ్లం, గాలిక్ ఆమ్లం, టానిన్లు
పెక్టిన్లు, క్రోమియం, జింక్, కాపర్‌లాంటి
లోహలు ఉసిరిలో ప్రధానంగా ఉంటాయి.
ü వంద
గ్రాముల ఉసిరిలో సుమారు 900 మిల్లీ గ్రాముల
సీ విటమిన్, 7.05 శాతం నీరు, 5.09 శాతం
చక్కెర ఉంటుంది. లేత ఆకు పచ్చ రంగులో ఒగరుగా ఉండే ఉసిరి కాయలను చూడగానే
నోరూరుతుంటుంది. చాలా ప్రాంతాల్లో ఉసిరి కాయల్ని ఉప్పు, పసుపు
వేసి ఎండబెట్టి ఏడాది పొడవునా నిల్వ ఉంచుకుంటారు. అనేక రకాల తొక్కులు
పెట్టుకుంటారు. ఆయుర్వేదంలోనూ ఉసిరికి చాలా ప్రాముఖ్యముంది. ఉసిరిలో యాంటీ వైరల్, యాంటీ
మైక్రోబియాల్ గుణాలు అధికంగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది.
డాక్టర్. యన్ . క్రిష్ణ ప్రియ, అగ్రికల్చర్
పి.హెచ్.డి., వ్యవసాయ విస్తరణ విభాగము. 9493 588885.
డాక్టర్.జి. శివ నారాయణ , ప్రిన్సిపల్
సైంటిస్ట్ & కో ఆర్డినేటర్, డాట్ సెంటర్, ఒంగోలు.
No comments:
Post a Comment