సూక్ష్మ పోషక రసాయనిక ఎరువులు :
సూక్ష్మ పోషక లోపాలు ఏర్పడడానికి ముఖ్య కారణాలు:
- అధిక దిగుబడి నిచ్చు వంగడాల సేద్యం
- సంవత్సర కాలం లో 2-3 పంటలు వేయడం (cropping intensity)
- విచక్షణా రహితం గా రసాయనిక ఎరువుల వాడకం
- సేంద్రియ ఎరువులు పూర్తిగా వేయక పోవడం
సూక్ష్మ పోషక లోపాల నివారణ:
- సేంద్రియ పదార్ధాలు విరివి గా వాడడం
- రసాయనిక ఎరువులు వాడకం లో సమతుల్యత
- ప్రత్యేకం గా సూక్ష్మ పోషకాలున్న రసాయన పదార్దాలు లేదా రసాయనిక ఎరువులు నేలలో వేయడం
- లోప లక్షణాలు కనిపించినపుడు ఆయా పోషక పదార్ధాలు ద్రావకం గా తయారు చేసి పిచికారీ చేయడం
సూక్ష్మ పోషక ఎరువులు రెండు రకాలు:
- సూక్ష్మ పోషకాలు కలిగి ఉన్న ఖనిజ లవణాలు
- చిలేటేడ్ రూపం లో యున్న సూక్ష్మ పోషకాలు, సేంద్రియ పదార్ధం చే రింగు ఆకారం లో బంధింపబడి వుంటాయి.
సూక్ష్మ పోషకాల లోపాలు –సవరణ
జింకు లోప నివారణ:
ü ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్ ప్రతి మూడు పంటలకు ఒకసారి వేసి లోపాన్ని నివారించ వచ్చును. అదే వరి తర్వాత వరి పంట ను వరుసగా వేసినట్లయితే ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్ ను ప్రతి రబీ పంటకు ముందు వేసి నివారించ వచ్చు
ఇనుప ధాతు లోప నివారణ:
ü లీటరు నీటికి 20 గ్రాముల అన్న భేది (Ferrous sulphate), 2 గ్రాముల నిమ్మ ఉప్పు కలిపి పిచికారి చేయాలి. పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నపుడు తక్కువ గాడత కల్గిన ద్రావణాన్ని (0.5 -1.0) వాడాలి.
బోరాన్ లోప నివారణ:
ü 0.1 శాతం బోరిక్ ఆమ్లాన్ని (1 లీటరు నీటికి 1 గ్రాము) రెండు సార్లు 10-15 రోజుల వ్యవధి లో పిచికారి చేయాలి. ప్రత్యామ్నాయం గా ముందు జాగ్రత్త గా చెట్టు పాదు లో 50 గ్రాముల బోరాక్స్ వేయాలి.
మెగ్నీషియం లోప నివారణ:
ü లీటరు నీటికి 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ పైరు వేసిన 45, 90 రోజుల తర్వాత పిచికారి చేయాలి.
మాలిబ్డినం లోప నివారణ:
ü ఎకరానికి 400 గ్రాముల సోడియం మాలిబ్డేట్ ను మట్టి లో కలిపి వేయాలి.
వివిధ సూక్ష్మ పోషకాల ఎరువులు – పోషక పరిమాణము
ఇనుము :
- ఫెర్రస్ సల్ఫేట్ (Ferrous sulphate) FeSO4.7H20 20%
- ఫెర్రస్ చీలేట్ (Ironchelate) Fe – EDTA 5%
- ఫెర్రస్ చీలేట్ (Iron chelate) Fe – EDDHA 6%
మాంగనీసు:
- మాంగనీస్ సల్ఫేట్ (Manganous sulphate) Mn SO4.4H20 24%
- మాంగనస్ సల్ఫేట్ (Manganous sulphate monohydrate) Mn SO4. H2O 32%
- మాంగనీస్ చీలేట్ (Manganese chelate) Mn – EDTA 13%
తుత్తు నాగము (zinc)
- జింకు సల్ఫేట్ (zinc sulphate) Zn SO4 . 7 H2O 21%
- జింకు సల్ఫేట్ మోనో హైడ్రేట్ (zinc sulphate mono hydrate Zn SO4 .H2O 36%
- జింకు చీలేట్ (zinc chelate) Zn EDTA 14%
బోరాన్ (Boron)
- బోరాక్స్ (borox)/ సోడియం టెట్రా బోరేట్ Na2 B4 O7. 10 H2O 11%
- బోరాక్సు ఎన్ హైడ్రస్ Na2 B4 O7 22%
- బోరిక్ ఆమ్లము (Boric acid) H3BO3 18%
మాలిబ్డినం(Molybdenum)
- సోడియం మాలిబ్డేట్ (sodium molybdate) Na2 Mo7 O24 . 4 H20 40%
- అమ్మోనియం మాలిబ్డేట్ (AmmOnium molybdate) (NH4) MO7 O24. 4 H20 54%
- కాల్షియం మాలిబ్డేట్ (Calcium molybdate Ca Mo O4 48%
No comments:
Post a Comment