నేల సారం తగ్గడానికి గల కారణాలు
2. నేల సారం తగ్గడానికి గల కారణాలు:
a) పంటలు వినియోగించుకోవడం వలన: వివిధ రకాల పంటలు వివిధ పరిమాణాల్లో పోషక పదార్ధాలను తీసుకోవడం( ఉదా: వరి 3 టన్నుల దిగుబడి వస్తే 85-15-90 కిలోల నత్రజని, భాస్వరాన్ని, పొటాషియం లను పంట తీసుకుంటుంది. అదే విధం గా 5 టన్నుల దిగుబడి నిచ్చు మొక్కజొన్న 170-35-175 కిలోల నత్రజని, భాస్వరం, పొటాష్ లను తీసుకొంటుంది.
b) కలుపు మొక్కలు: (weeds): పంట మొక్కల కంటే అత్యధిక పాళ్ళలో పోషక పదార్ధాలను గ్రహించడం వల్ల నేల సారం తగ్గుతుంది.
c) నేల కోత: (soil erosion): సారవంతమైన నేల పై పొర కోత వల్ల (నీటి వల్ల గాని, గాలి వలన గాని) నేల సారం తగ్గి పోతుంది.
d) సులభం గా కరిగే పోషక పదార్ధాలు నేల లోపలి పొరలలోనికి దిగిపోవడం (leaching): నత్రజని నైట్రేట్ రూపం లోనికి మారిన వెంటనే నీటితో పాటు నేల అడుగు పొరల లోనికి పోతుంది.
e) వాయు రూపం లో నష్టం: (volatalization) : రసాయనిక ఎరువులు నేలపై జల్లడం వల్ల నీటిలో కరిగి సూర్యరశ్మి చే ఆవిరి రూపం లో గాలిలో కలిసి పోవడం – నత్రజని ఈ విధం గా నష్ట పోతాము.
f) పోషకాలు శాస్త్రీయ పధ్ధతి లో వాడక పోవడం: ముఖ్యం గా రసాయనిక ఎరువులు నేలలో వేసేటప్పుడు మొక్కలకు అందుబాటులో గల దూరం లో కొంత లోతున వేసి మట్టి తో కప్పిన చాలా వరకు నష్టాలను తగ్గించ వచ్చు.
g) సంకీర్ణ ఎరువులు : సంకీర్ణ ఎరువులు (28-28-0) (17-17-17) మొదలైనవి వాడడం వలన సూక్ష్మ పోషక లోపాలు కనబడతాయి.
h) సూక్ష్మ పోషకాల విషయం లో శ్రద్ధ చూపకపోవడం : ప్రతి పంటకు నత్రజని, భాస్వరం మరియు పొటాష్ గల ఎరువులను అధిక మోతాదు లలో వాడుచున్నారు కాని సూక్ష్మ ధాతు పోషకాల అవసరాన్ని గమనించడం లేదు.
i) పంట మార్పిడి చేయక పోవడం : పంట మార్పిడి చేయక పోవడం వల్ల పంట యొక్క వేర్లు ఒకే లోతుకు చొచ్చుకొని పోయి అక్కడ గల పోషకాలనే తీసుకొంటుంది. ఆ విధం గా కాకుండా ఒక పంట వేర్లు పై పై నే వుండి పోషకాలు తీసుకొంటే (ఉదా: వరి, జొన్న, మొక్కజొన్న మొదలైనవి) మరొక పంట వేర్లు లోతు గా పోవునది ఎంచు కోవాలి ( ఉదా: కంది, ప్రత్తి, పొద్దుతిరుగుడు పువ్వు). దీనివలన చీడ పీడల బాధ కూడా తగ్గును.
No comments:
Post a Comment